Hero and Heroines
-
రిపీట్టే...
ఒక సినిమాలో హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితే మళ్లీ ఆ జంటను చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అయితే ఆ జంటకి మ్యాచ్ అయ్యే కథ దొరకాలి.. ఆ కథకు ఈ ఇద్దరినే హీరో–హీరోయిన్గా తీసుకోవాలనే ఆలోచన డైరెక్టర్‌కి రావాలి. ఇలా కొన్ని జంటలకు కథ కుదిరింది.ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తే బాగుండనే ఆలోచన డైరెక్టర్‌కీ వచ్చింది. ‘రిపీట్టే..’ అంటూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఆ జంటలు చేస్తున్న చిత్రాల గురించి... ► ‘వినయ విధేయ రామ’ చిత్రంతో ఆకట్టుకున్న హీరో రామ్‌చరణ్–హీరోయిన్ కియారా అద్వానీ ‘గేమ్ చేంజర్’ కోసం రెండోసారి జోడీ కట్టారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. ‘భరత్ అనే నేను’ (2018) సినిమాతో కియారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘వినయ విధేయ రామ’ (2019) లో రామ్‌చరణ్‌కి జోడీగా నటించారామె. ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇక ఈ ఇద్దరూ జత కట్టిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ΄÷లిటికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూ΄పొందుతోంది. ► ‘లవ్‌స్టోరి’ (2021)తో ప్రేక్షకులకు అందమైన ప్రేమకథని చూపించారు హీరో నాగచైతన్య–హీరోయిన్ సాయిపల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూ΄పొందిన ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ జంట రెండేళ్లకు రెండోసారి జోడీగా నటిస్తున్నారు. ‘ప్రేమమ్’ (2016), ‘సవ్యసాచి’ (2018) చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య– డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో మూడో సినిమా రూ΄పొందుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా సాయి పల్లవి నటించనున్నారు. చైతు–సాయిపల్లవి తొలిసారి జత కట్టిన ‘లవ్‌స్టోరి’లానే తాజా చిత్రం కూడా ప్రేమ ప్రధానాంశంగా సాగుతుంది. ► ‘భీష్మ’ వంటి హిట్ సినిమా తర్వాత నితిన్–రష్మికా మందన్నా రెండోసారి నటించనున్న సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘భీష్మ’ (2020) చిత్రంలో నితిన్– రష్మిక తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రత్యేకించి నితిన్–రష్మిక డ్యాన్స్‌లు ప్రేక్షకులను అలరించాయి. ఇక వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘ఛలో’ చిత్రం ద్వారానే రష్మిక తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ విధంగా నితిన్–రష్మిక–వెంకీ కుడుముల.. ఈ ముగ్గురి కాంబినేషన్లో తాజాగా రెండో సినిమా రూ΄పొందుతోందని చెప్పొచ్చు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి రష్మికా మందన్న తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ కారణంగా డేట్స్ సర్దుబాటు కాక΄ోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నారట. ఆమె స్థానంలో శ్రీలీల అవకాశం అందుకున్నారని టాక్. ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ► ‘గీత గోవిందం’(2018), ‘డియర్ కామ్రేడ్’ (2019) వంటి చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారని టాక్. విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్) చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలుత హీరోయిన్గా శ్రీ లీలను ఫిక్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్పై రూ΄పొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే వరుస సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ‘వీడీ 12’ ్రపాజెక్ట్ నుండి శ్రీ లీల తప్పుకున్నట్లు టాక్ . దీంతో చిత్ర యూనిట్ రష్మికా మందన్నాని సంప్రదించగా... ఈ బ్యూటీ పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. ఇదే నిజం అయితే విజయ్–రష్మిక కలిసి నటించనున్న మూడో చిత్రం ఇదే అవుతుంది. అయితే నితిన్ సినిమా నుంచి రష్మిక తప్పుకోవడంతో ఆ ప్లేస్‌ని శ్రీ లీల భర్తీ చేశారని, విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకుంటే ఈ ్రపాజెక్ట్లోకి రష్మిక ఎంట్రీ ఇచ్చారనే వార్తలపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ► ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత హీరో కల్యాణ్ రామ్–హీరోయిన్ సంయుక్తా మీనన్ ‘డెవిల్’ సినిమా కోసం రెండోసారి జోడీ కట్టారు. వశిష్ఠ దర్శకత్వంలో కల్యాణ్ రామ్–సంయుక్తా మీనన్ జంటగా నటించిన తొలి చిత్రం ‘బింబిసార’ (2022). ఈ చిత్రవిజయంతో హిట్ పెయిర్ అనిపించుకున్న కల్యాణ్ రామ్–సంయుక్తా మీనన్ తాజాగా ‘డెవిల్’లో నటిస్తున్నారు. దేవాన్ష్ నామా సమర్పణలో పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా నవంబర్ 24న రిలీజ్ కానుంది. ఇలా రిపీట్ అవుతున్న జంటలు ఇంకొన్ని ఉన్నాయి. -
మరోసారి జంటలుగా రానున్న హీరో-హీరోయిన్లు..
హీరో-హీరోయిన్ జోడీ రిపీట్ కావడం కామన్. అయితే ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఒకేసారి పది జంటలు రిపీట్ అవుతున్నాయి. అన్నీ భారీ చిత్రాలే. బోలెడన్ని అంచనాలున్న సినిమాలే. ఇక రిపీట్ అవుతున్న జోడీ నటిస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. చిరంజీవి-తమన్నా మళ్లీ ఆన్‌స్క్రీన్ లవర్స్‌గా కనిపించనున్నారు. ‘సైరా’లో ఈ ఇద్దరూ ప్రేమికులుగా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘బోళా శంకర్’లో జంటగా నటిస్తున్నారు. తమిళ ‘వేదాళం’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ కథ ప్రకారం ముందు హీరోని చంపాలనుకుంటుంది హీరోయిన్. ఆ తర్వాత అతనితో ప్రేమలో పడుతుంది. తెలుగు రీమేక్‌లోనూ ఇలానే ఉంటుందని అనుకోవచ్చు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేష్ కనిపిస్తారు. ఇక ‘మహర్షి’లో రిషీ కుమార్ (మహేశ్‌బాబు), పూజ (పూజా హెగ్డే)ల చిన్ని చిన్ని అలకలు, ప్రేమ, దూరం కావడం, మళ్లీ దగ్గరవడం చూశాం. తాజాగా త్రివిక్రమ్ సినిమా కోసం ఇద్దరూ మళ్లీ జత కట్టారు. మహేశ్-పూజ జతకట్టిన రెండో సినిమా ఇది. అయితే త్రివిక్రమ్‌తో ఈ ఇద్దరికీ మూడో సినిమా కావడం విశేషం. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్-మహేశ్, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్-పూజా హెగ్డే కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందనుంది. మరోవైపు రామ్ చరణ్-కియారా అద్వానీ కూడా మళ్లీ జతకట్టారు. ‘వినయ విధేయ రామ’లో తొలిసారి ఈ జంట కనిపించింది. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్నారు. శంకర్ డైరెక్ట్‌గా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఇదే. ఇక ఈ సంక్రాంతికి క్యూట్ లవర్స్‌గా ‘బంగార్రాజు’లో కనిపించిన నాగచైతన్య, కృతీ శెట్టి మరో సినిమాలో హీరో హీరోయిన్గా కనిపించనున్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. కోలీవుడ్‌కి చైతూ ఎంట్రీ ఈ సినిమాతోనే జరుగుతోంది. కాగా ఆల్రెడీ రామ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘ది వారియర్’ ద్వారా కోలీవుడ్‌కి పరిచయం కానున్నారు కృతి. చైతూ, రాశీ ఖన్నాల జోడీ కూడా మళ్లీ కనిపించనుంది. ‘వెంకీ మామ’లో జంటగా నటించిన నాగచైతన్య-రాశీ ఖన్నా తాజాగా ‘థ్యాంక్యూ’లో హీరో, హీరోయిన్గా నటించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 22న విడుదల కానుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత నాని-కీర్తీ సురేష్ జోడీ రిపీట్ కానుంది. ఈ ఇద్దరూ ‘నేను లోకల్’లో తొలిసారి జంటగా నటించారు. తాజాగా ‘దసరా’లో నటిస్తున్నారు. తెలంగాణలోని గోదావరి ఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఇంకోవైపు ఇంకోసారి ఖుషీగా జోడీ కట్టారు విజయ్ దేవరకొండ-సమంత. ‘మహానటి’లో ఈ ఇద్దరూ జంటగా నటించారు. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖుషి’లో నటిస్తున్నారు. వీళ్లే కాదు.. రెండోసారి జంటగా కనిపించనున్న హీరో-హీరోయిన్లు ఇంకా ఉన్నారు. -
'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు..
Upcoming Movies Of Bollywood Actors And Actresses Playing In Blind Role: చాలెంజింగ్ రోల్స్ ఒప్పుకోవాలంటే మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకోవాలి. ‘గెలుచుకుంటామనే నమ్మకం ఉంది’ అంటున్నారు కొందరు తారలు. ‘మైండ్‌లో ఫిక్సయితే.. బ్లైండ్‌గా చేస్తాం’ అంటూ అంధులుగా నటించడానికి రెడీ అయ్యారు. నటనతో తమ సత్తా చూపిస్తామంటున్నారు. ఈ స్టార్స్ చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేయండి. బిజినెస్ డీలింగ్స్‌తో బిజీ కానున్నారు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్. ఆయన అన్ని విషయాలనూ శ్రద్ధగా వింటారు.. కానీ చూడరు. ఎందుకంటే.. బ్లైండ్. చూపు లేకపోయినా సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్. ఆంధ్ర ప్రదేశ్‌లోని మచిలీపట్నంలో పుట్టిన బొల్లా శ్రీకాంత్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో శ్రీకాంత్‌గా రాజ్‌కుమార్ రావ్ నటించనున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్‌లో చేరిన తొలి అంధుడిగా శ్రీకాంత్ బొల్లా రికార్డు సృష్టించిన విషయం చాలామందికి తెలుసు. అలాగే ఎంతో మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు శ్రీకాంత్. ఈ సక్సెస్ఫుల్ మేన్ జీవితంతో దర్శకురాలు తుషార్ హిద్రానీ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి టీ సిరీస్ భూషణ్ కుమార్ ఓ నిర్మాత. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ఓ లేడీ పోలీసాఫీసర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే..n ఈ పోలీసాఫీసర్ బ్లైండ్. మరి.. ఆ సీరియల్ కిల్లర్‌ను ఈ బ్లైండ్ పోలీసాఫీసర్ ఎలా పట్టుకున్నారు? ఆమెకు హెల్ప్ చేసింది ఎవరు? అనే అంశాలు ఆసక్తికరం. పోలీసాఫీసర్‌గా సోనమ్‌కపూర్ నటించిన చిత్రం ‘బ్లైండ్’. షోమ్ మఖీజా ఈ చిత్రానికి దర్శకుడు. 2011లో వచ్చిన సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘బ్లైండ్’కు రీమేక్ ఇది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం సోనమ్ కపూర్ ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. ఆమె డెలివరీ తర్వాత హిందీ ‘బ్లైండ్’ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కళ్లు కనబడకపోతే సాధారణ జీవితాన్ని ఎలా మేనేజ్ చేయవచ్చో తెలుసుకున్నారు తాప్సీ. హఠాత్తుగా తాప్సీ ఇలా ఎందుకు చేశారంటే.. ‘బ్లర్’ సినిమా కోసమే. 2010లో వచ్చిన స్పానిష్ థ్రిల్లర్ ‘జూలియాస్ ఐస్’ చిత్రం హిందీలో ‘బ్లర్’గా రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలోనే తాప్సీ అంధురాలి పాత్ర చేస్తున్నారు. ఈ కథ నచ్చి తాప్సీ ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... క్రమంగా చూపు మందగించే ఓ గృహిణి పాత్రలో తాప్సీ కనిపిస్తారు. సరిగ్గా చూపు కనిపించాలని ఓ సర్జరీ కూడా చేయించుకోవాలనుకుంటారు. కానీ ఇంతలో ఊహించని పరిణామాలు. ఆమె సోదరి హత్యకు గురవుతుంది. అయితే అప్పటికే ఆమె తన పూర్తి కంటి చూపును కోల్పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ‘బ్లర్’ చిత్రం. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు అంధురాలిగా ఓ సమూహాన్నే లీడ్ చేయనున్నారు హీరోయిన్ హీనాఖాన్. హీనాతో ఉన్న సమూహంలోని అందరూ కూడా బ్లైండే. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ అనే నవల ఆధారంగా ఆమె చేస్తున్న సినిమా కథాంశం ఇది. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ టైటిల్‌తోనే తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఇటీవల కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. ఈ ఇండో ఇంగ్లిష్ సినిమాకు రహత్ కజ్మీ దర్శకుడు. రాజ్‌కుమార్, సోనమ్, తాప్సీ, హీనా.. ఈ నలుగురూ సవాల్‌లాంటి పాత్రలతో బాక్సాఫీస్‌పై గురి పెట్టారు. ఈ సినిమాల వైపు ప్రేక్షకులు చల్లని చూపు చూస్తే ఈ స్టార్స్ కళ్లనుంచి ఆనందభాష్పాలు రావడం ఖాయం. -
చెల్లెలి పాత్రల్లో స్టార్ హీరోయిన్స్..
తెలుగు తెరపై అన్నా-చెల్లెలి అనుబంధం అంటే ముందు గుర్తొచ్చే సినిమా ‘రక్త సంబంధం’. హీరో–హీరోయిన్గా హిట్ పెయిర్ అనిపించుకున్న ఎన్టీఆర్–సావిత్రి అన్నా–చెల్లెలిగానూ ఆ సినిమాలో మెప్పించారు. కథానాయికగా సావిత్రి మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు రిస్క్ అనుకోకుండా ‘సిస్టర్’ క్యారెక్టర్ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ తరంలో హీరోయిన్లుగా మంచి ఫామ్‌లో ఉన్న నయనతార, పూజా హెగ్డే, కీర్తీ సురేశ్ కూడా చెల్లెలి పాత్ర చేయడానికి వెనక్కి తగ్గడంలేదు. ఈ చెల్లెళ్లుగా మెరవనున్న స్టార్ హీరోయిన్స్, చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. ‘సైరా’లో భార్య.. ‘గాడ్ ఫాదర్’లో చెల్లెలు ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు మరోవైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్గా చేస్తూ నయనతార బిజీ బిజీగా ఉన్నారు. ఒక హిందీ, ఒక మలయాళం, రెండు తమిళ చిత్రాలు, తెలుగులో చేస్తున్న ‘గాడ్ ఫాదర్’తో కలుపుకుని ఐదు చిత్రాలతో బిజీగా ఉన్నారు నయన. మిగతా చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తుండగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో కీలక పాత్ర చేస్తున్నారామె. మలయాళ సినిమా ‘లూసిఫర్’కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. మలయాళంలో హీరో మోహన్‌లాల్ చెల్లెలి పాత్రలో మంజు వారియర్ కనిపించారు. కథ ప్రకారం హీరోకి జోడీ ఉండదు. తెలుగులోనూ చిరంజీవికి జోడీ ఉండదని చెప్పొచ్చు. అందుకే నయనతార చేస్తున్నది చిరంజీవి చెల్లెలి పాత్ర అనే ఊహాగానాలు ఉన్నాయి. నయనతారది కీలక పాత్ర అని పేర్కొన్న చిత్రబృందం ఆమెది చెల్లెలి పాత్ర అని మాత్రం స్పష్టం చేయలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చిరు సిస్టర్ పాత్రనే ఆమె చేస్తున్నారని తెలిసింది. ‘సైరా’లో చిరంజీవి భార్యగా నయనతార నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’లో అన్నాచెల్లెళ్లుగా ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ప్రేక్షకులకు తప్పకుండా ఉంటుంది. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సిస్టర్ ఆఫ్ బోళా శంకర్ కీర్తీ సురేశ్ మహానటి.. అందులో డౌటే లేదు. ‘మహానటి’ చిత్రం ఆ విషయాన్ని నిరూపించింది. ఇటు తెలుగు అటు తమిళ, మలయాళంలో లేడీ ఓరియంటెడ్, రెగ్యులర్ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్న కీర్తీ సురేష్ తొలిసారి చెల్లెలి పాత్రలో కనిపించిన చిత్రం ‘పెద్దన్న’. ఇందులో రజనీకాంత్ చెల్లెలిగా కనిపించారామె. ఇప్పుడు ‘బోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలి పాత్ర చేస్తున్నారు. ఇలా వరుసగా చెల్లెలి పాత్రలు చేస్తే అలాంటివే వచ్చే అవకాశం లేకపోలేదు కదా? అని కీర్తీ సురేశ్‌తో అంటే.. ‘వచ్చే అవకాశాల గురించి ఆలోచించి ఇప్పుడు వచ్చిన మంచి క్యారెక్టర్లు వదులుకోవాలనుకోను. అటు రజనీ సార్, ఇటు చిరంజీవి సార్ ఇద్దరి సినిమాల్లో చాన్స్ అంటే చిన్న విషయం కాదు కదా’ అన్నారు కీర్తి. గత ఏడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘బోళా శంకర్’లో చిరంజీవికి కీర్తి సురేశ్ రాఖీ కడుతున్న ఫొటో విడుదలైంది. ఆ ఫొటోలో ఈ అన్నాచెల్లెళ్ల కెమెస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. వెంకటేశ్ చెల్లెలు? గ్లామరస్ స్టార్ పూజా హెగ్డే ఒకవైపు మంచి మసాలా సినిమాల్లో హీరోయిన్గా చేయడంతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. ‘గని’ చిత్రంలో కనిపించినట్లు హోమ్లీ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు. తాజాగా ఆమెకు చెల్లెలి పాత్రకు అవకాశం వచ్చిందని సమాచారం. అయితే అది హిందీ సినిమా. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ‘కబీ ఈద్ కబీ దీవాలి’ చిత్రంలో ఈ కండలవీరుడి సరసన కథానాయికగా నటిస్తున్నారు పూజా హెగ్డే. ఇందులో వెంకటేశ్ కీలక పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వెంకీ చెల్లెలిగా పూజా కనిపిస్తారట. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకుడు. చదవండి: జాకీతో ప్రేమ.. అది నాకిష్టం లేదు: రకుల్ ప్రీత్ సింగ్ నా సినిమాకు నాకే టికెట్లు దొరకలేదు: యంగ్ హీరో -
సమాజ అభ్యున్నతి కోసం...
పంచామృతం సెలబ్రిటీలకు ఇమేజ్ ఉంటుంది. గ్లామర్ ఉంటుంది. స్టార్డమ్ ఉంటుంది. కానీ వాళ్లకు కాసింత బాధ్యత, కూసింత ఆలోచన, కొంత మేథ ఉంటే ఎంత బావుటుంది? సమాజంలో వివిధ వర్గాల వారి సమస్యల గురించి పట్టించుకొని, వారి తరపున తమ వాయిస్‌ను వినిపిస్తూ, సమాజాభ్యున్నతికి కృషి చేస్తే ఎంత బావుంటుంది? లేదా కృషి చేస్తున్న వారికి అండగా నిలబడితే ఎలా ఉంటుంది. అలా సమాజంలోని సమస్యలను గుర్తించి వాటి ని పరిష్కరించే బాధ్యత ఎరిగిన ప్రముఖుల్లో కొందరు వీరు... విద్యాబాలన్... తాగునీటి పారిశద్ధ్యం విషయంలో కేంద్రగ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతినిధిగా ఉంది విద్యాబాలన్. ప్రభుత్వం ఈ విషయంలో చేపడుతున్న ప్రజావగాహన కార్యక్రమాల్లో విద్య స్వయంగా పాల్గొంటోంది. ఈ విధంగా డర్టీపిక్చర్హీరోయిన్ ఒక క్లీన్ కాజ్ విషయంలో ప్రభుత్వానికి చేయూతగా నిలుస్తోంది. షకీరా... ప్రత్యేకించి చిన్నపిల్లలు అంటే షకీరాకు ఎంతో మమకారం. వారి కోసం అనునిత్యం ఏదో ఒక సేవాకార్యక్రమం చేపడుతుండటమే అందుకు రుజువు. పేద పిల్లల చదువు కోసం నిధుల సమీకరిస్తూ, తను కూడా దాతృత్వాన్ని చాటుకొంటూ ఉంటుంది ఈ పాప్ సింగర్. అంతేగాక పిల్లల హక్కుల కోసం, వారికి మంచి బాల్యాన్ని అందించడం కోసం వివిధ దేశాల చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వామి కావడంతో పాటు అవసరమైన సందర్భాల్లో పిల్లల తరపున ప్రభుత్వాలతో పోరాడుతూ తన సామాజికస్పృహను చాటుకొంటోంది. శిల్పాషెట్టి... బిగ్‌బ్రదర్ రియాలిటీ షో విజేతగా శిల్పాషెట్టికి కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ వచ్చిందని అందరికీ తెలుసు. అయితే ఆమె ఆ సొమ్మును ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ కోసం విరాళంగా ఇచ్చేసిందని చాలా మందికి తెలీదు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన నింపడానికి శిల్ప తన వంతు సహకారం అందిస్తోంది. అంతేగాక పెటా వంటి సంస్థల్లో సభ్యురాలు. ఎద్దులతో బరువులను లాగించడానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ‘యాంటీ బుల్లింగ్’ చారిటీ సంస్థలతో కలిసి పనిచేస్తోంది శిల్ప. రాహుల్‌బోస్... కులం, మతం, రంగు అనేవి మనుషుల మధ్య వివక్షకు కారణం కాకూడనేది రాహుల్‌బోస్ ఆకాంక్ష. అలాంటి వివిక్షలేని సమాజం కోసం పాటుపడుతున్న ఎవరికోసం అయినా సరే బోస్ తన సహకారం అందిస్తాడు. ‘వివక్ష రహిత సమాజం’ కోసం పాటు పడే అనేక స్వచ్ఛంద సంస్థలకు సహయకారిగా ఉన్నాడు బోస్. అలాగే అండమాన్ నికోబర్ దీవుల్లో ప్రజల పునరావసం కోసం పాటుపడుతున్న వారికి కూడా బోస్ సన్నిహితుడే. ఆయా సంస్థలకు ఫండింగ్ విషయాల్లో, ప్రచారం విషయాల్లో బోస్ సహకారం అందిస్తూ ఉంటాడు. దియామీర్జా... ఈ మాజీ మిస్ ఆసియా-పసిపిక్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ క్యాంపెయినర్. కొంతమంది యువతీయువకులతో కలిసి పచ్చదనం, పరిశుభ్రతలను కాపాడటం గురించి ఆన్లైన్క్యాంపెయినింగ్తో పాటు ప్రత్యక్షంగా కూడా పాల్గొంటూ తన సేవానిరతిని చాటుకొంటోంది. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్లో ఎయిడ్స్ నివారణ అవగాహన నింపడానికి చేస్తున్న ప్రయత్నాల్లో కూడా దియా తన భాగస్వామి అయ్యింది.