కాంబినేషన్ రిపీట్‌? | Ravi Teja power movie combination repeat again | Sakshi
Sakshi News home page

కాంబినేషన్ రిపీట్‌?

Published Mon, Jul 15 2024 2:29 AM | Last Updated on Mon, Jul 15 2024 2:29 AM

Ravi Teja power movie combination repeat again

‘పవర్‌’ మూవీ కాంబినేషన్  మళ్లీ రిపీట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవితేజ హీరోగా బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్  థ్రిల్లర్‌ మూవీ ‘పవర్‌’. 2014లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. అయితే రవితేజ, బాబీల కాంబినేషన్  మళ్లీ రిపీట్‌ కానుందనే టాక్‌ ఫిల్మ్‌ నగర్‌లో వినిపిస్తోంది. రవితేజ కోసం ఓ పవర్‌ఫుల్‌ కథను రెడీ చేస్తున్నారట బాబీ. త్వరలోనే రవితేజకి ఫైనల్‌ నెరేషన్  ఇవ్వనున్నారట దర్శకుడు.

అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్ లో మరో సినిమా సెట్‌ అవుతుందని టాలీవుడ్‌ టాక్‌. అంతేకాదు.. ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించనున్నారని  భోగట్టా. ఈ సంగతి  ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోనూ రవితేజ ఓ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై హిట్‌ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement