‘‘బేబి’కి నా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారనే నమ్మకం ఉండేది. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందేమో? అనే భయం కూడా ఉండేది. ఫ్లాప్ అయినా సంగీతం, కెమెరా, నటీనటులు.. ఇలా అందరికీ పేరు వస్తుంది.. కానీ నా కెరీర్ నాశనం అవుతుందని తెలిసినా రిస్క్ చేసి ‘బేబి’ చేశాను. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు.
(ఇదీ చదవండి: ఎవరూ నమ్మలేరు మన హీరోయిన్లు పాక్ సినిమాల్లో నటించారంటే)
ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. బేబీ’కి ఆనంద్ కంటే ముందు ముగ్గురు హీరోలను అనుకున్నామని ఆయన చెప్పారు. అందులో ఓ హీరోని కలిశాక హ్యాండిల్ చేయలేనేమో అని భయపడి వెనక్కి తగ్గినట్టు తెలిపాడు. దీంతో మరో హీరోకి కథ చెప్పడం కోసం నిర్మాణ సంస్థ నుంచి ఫోన్ చేస్తే ‘సాయిరాజేశ్ దర్శకత్వం అయితే చేయనని ఓపెన్‌గానే అన్నట్లు పేర్కొన్నాడు.
‘హృదయం కాలేయం’ సినిమాతో తనపై పడిన ముద్ర అలాంటిదని చెప్పుకొచ్చాడు. ఆ క్షణమే ‘బేబి’ జాతకం మారిపోయింది. ఆ రోజంతా చాలా బాధపడ్డానని, ఆరోజు నిద్రకూడా పట్టలేదని తెలిపాడు. నిజానికి ‘బేబి’తో పోలిస్తే 'హృదయ కాలేయం'లాంటి సినిమా చేయడమే కష్టమని సాయిరాజేశ్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment