శ్రీమతి గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'డర్టీ ఫెలో'. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించారు. జియస్ బాబు నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని మూవీ రిలీజ్‌కు రెడీ అయింది.
(ఇదీ చదవండి: ఏడాది కిందట నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన హీరోయిన్)
తాజాగా ఈ సినిమాలోని 'సందేవేళ' అంటూ సాగే పాటని 'బేబి' దర్శకుడు సాయిరాజేష్ రిలీజ్ చేశారు. 'నా మిత్రుడు శాంతి చంద్ర నటించిన డర్టీఫెలో సినిమాలోని సందెవేళ సాంగ్ చాలా బాగుంది. సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చారు. త్వరలో చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని హీరో శాంతి చంద్ర చెప్పాడు.
(ఇదీ చదవండి: నా మాజీ భార్య వేధిస్తుంది.. ఫిర్యాదు చేసిన ప్రముఖ నటుడు)
Comments
Please login to add a commentAdd a comment