‘కుమారి 21 ఎఫ్’చిత్రం చూశాక నేను హెబ్బా పటేల్‌కి పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఆమె ఫోటోలను చూస్తూ ఉండిపోయేవాడిని. నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయ్యేవాళ్లకి తెలుసు నేను హెబ్బాకి ఎంత పెద్ద అభిమానినో. రామ్ గోపాల్ వర్మకి శ్రీదేవి అంటె ఎంత ఇష్టమో..నాకు హెబ్బా అంటే కూడా అంతే ఇష్టం’ అని ‘బేబీ’ డైరెక్టర్ సాయి రాజేశ్ అన్నారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. నవంబర్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి సాయి రాజేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ‘దినేష్ చాలా మంచి వ్యక్తి. మంచి నటుడు. అతనికి సరైన బ్రేక్ రావాలి. బేబితో మా జీవితాలు మారిపోయాయి. ఈ చిత్రంతో దినేష్ లైఫ్ మారిపోవాలి. పాయల్ గారు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. హెబ్బా నాకు మంచి స్నేహితురాలు. తన మనసు చాలా మంచింది. సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఈ చిత్రం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నాడు.
నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ..‘ఈ సినిమాకు హెబ్బా పటేల్ మెయిన్ ఎసెట్. సినిమాను భుజాల మీద మోసింది. సుభాష్ మ్యూజిక్, ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చాడు. చంద్రబోస్ గారు రాసిన ఆరు పాటలు, ఓ బిట్ అద్భుతంగా ఉంటాయి’ అన్నారు.
‘లవ్, కెరీర్ మధ్య జరిగే సంఘర్షణే ఈ మూవీ. ప్రేమను ఎంచుకోవాలా? కెరీర్‌ను ఎంచుకోవాలా? రెండూ ఎంచుకోవాలా? అన్నదే ఈ కథ. ఎమోషనల్‌గా వెంటాడుతుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా అదే ట్రాన్స్‌లో ఉంటారు. కన్నీళ్లతో బయటకు వస్తారు’ అని డైరెక్టర్ మారేష్ శివన్ అన్నారు. ఈ కార్యక్రమంలో దినేష్ తేజ్, పాయల్ రాధకృష్ణ తో పాటు చిత్రబృందం పాల్గొంది.
Comments
Please login to add a commentAdd a comment