Ala Ninnu Cheri Movie
-
ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా
ఈ వారం అందరూ 'సలార్' బిజీలో ఉన్నారు. చాలారోజుల పాటు వెయిట్ చేయించి థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. తొలిరోజు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల హౌస్‌ఫుల్స్ పడ్డాయి. దీంతో చాలామంది మూవీ లవర్స్‌కి టికెట్స్ దొరకలేదు. దీంతో ఏం చేయాలో తెలీక సతమతమవుతున్నారు. అదే టైంలో ఓటీటీలోకి పలు మూవీస్ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. (ఇదీ చదవండి: ‘సలార్’ మూవీ రివ్యూ) ఈ శుక్రవారం ఓటీటీలోకి ఆదికేశవ, టోబి లాంటి స్ట్రెయిట్-తెలుగు మూవీస్ వచ్చేశాయి. వీటితో పాటు మరో తెలుగు సినిమా.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. హెబ్బా పటేల్ హీరోయిన్గా నటించిన 'అలా నిన్ను చేరి' చిత్రం.. నవంబరు 10న థియేటర్లలో రిలీజైంది. చిన్న మూవీ కావడం, అప్పుడు వరల్డ్ కప్ హంగామా ఉండటంతో ఈ సినిమాని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో దినేశ్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. మారేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. కథ విషయానికొస్తే.. దివ్య (పాయల్ రాధాకృష్ణ)కి ఈమె తల్లి పెళ్లి ఫిక్స్ చేస్తుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం గణేశ్ (దినేశ్ తేజ్)తో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వీళ్లిద్దరి మధ్యలోకి అను (హెబ్బా పటేల్) వస్తుంది. ఆ తర్వాత ఏమైందనేది ఈ సినిమా స్టోరీ. (ఇదీ చదవండి: Salaar: ఆ ఓటీటీలోనే సలార్! దిమ్మతిరిగే రేటుకు..) -
‘అలా నిన్ను చేరి’ మూవీ రివ్యూ
టైటిల్: అలా నిన్ను చేరి నటీనటులు: దినేష్ తేజ్, హెబా పటేల్, పాయల్ రాధాకృష్ణ, ఝాన్సీ, చమ్మక్ చంద్ర, శత్రు తదితరులు నిర్మాత: కొమ్మాలపాటి సాయి సుధాకర్ దర్శకత్వం: మారేష్ శివన్ సంగీతం: సుభాష్ ఆనంద్ సినిమాటోగ్రఫి: అండ్రూ ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది: నవంబర్ 10, 2023 కథేంటంటే.. వైజాగ్‌లోని వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు గణేష్(దినేష్ తేజ్)కు సినిమాలు అంటే పిచ్చి. ఎప్పటికైనా దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు. ఆ దిశగా ప్రయత్నిస్తున్న సమయంలోనే తన గ్రామానికి చెందిన దివ్య(పాయల్ రాధాకృష్ణ)తో ప్రేమలో పడతాడు. ఈ విషయం దివ్య తల్లి కనకం(ఝాన్సీ) దృష్టికి రావడంతో.. కూతుర్ని తన బంధువువైన కాళీ(శత్రు)కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. దివ్య పెళ్లి విషయం తెలిసినా.. గణేశ్ అడ్డుకునే ప్రయత్నం చేయడు. తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం హైదరాబాద్‌కు వెళ్తాడు. సినిమా తీయాలన్న గణేష్ లక్ష్యం నెరవేరిందా? కాళీతో దివ్య పెళ్లి జరిగిందా? లేదా? ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతున్నా..గణేష్ ఎందుకు ఆపలేకపోయాడు? హైదరాబాద్‌లో గణేష్ పడిన కష్టాలేంటి? అతని జీవితంలోకి అను(హైబ్బా పటేల్)ఎలా వచ్చింది? అను పరిచయంతో గణేశ్ జీవితం ఎలా మారింది? తను ప్రేమించిన అమ్మాయి దివ్య..తనను ఇష్టపడిన అమ్మాయి అను..ఇద్దరిలో ఎవరిని గణేష్ తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అలా నిన్ను చేరి’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. లక్ష్యం కోసం ప్రేమను త్యాగం చేసిన ఓ మిడిల్ క్లాస్ యువకుడి కథే ‘అలా నిన్ను చేరి’. నేటితరం నచ్చే, మెచ్చే అంశాలతో ఫుల్ కమర్షియల్ ఫార్మాట్లో దర్శకుడు మారేష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే రొటీన్ సన్నివేశాలు, స్క్రీన్‌ప్లే కారణంగా స్టోరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ని చక్కగా డీల్ చేసిన దర్శకుడు.. సెకండాఫ్‌లో కాస్త తడబడ్డాడు. కానీ సాహిత్యం విషయంలో, నటీనటులను నుంచి తనకు కావాల్సిన నటనను రాబట్టుకోవడంతో మాత్రం సక్సెస్ అయ్యాడు. దర్శకుడిగా ఇది తొలి సినిమానే అయినప్పటికీ..కథను తీర్చి దిద్దిన విధానం బాగుంది. కథ ప్రారంభంగా రొటీన్‌గా ఉన్నా.. దివ్య, గణేష్ ప్రేమలో పడిన తర్వాత మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. హీరోయిన్ ప్రపోజ్ చేసే విధానం ఆకట్టుకుంటుంది. ఒకవైపు ప్రేమ..మరోవైపు లక్ష్యం రెండింటి మధ్య హీరో పడే సంఘర్షణకు సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు చక్కగా రాసుకున్నాడు. పల్లెటూరి ప్రేమ కథ.. మంచి సాహిత్యంతో ఫస్టాఫ్ ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం కథ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అను, గణేశ్‌ల మధ్య వచ్చే కొన్ని సన్నీవేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. సినిమా చాన్స్‌కోసం హీరో చేసే ప్రయత్నాలకు సంబంధించిన సన్నివేశాలు కూడా రొటీన్‌గా అనిపిస్తాయి. కానీ ఫ్రీ క్లైమాక్స్ నుంచి కథ ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమాను ముగించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. మిడిల్ క్లాస్ యువకుడు గణేష్ పాత్రకు దినేష్ తేజ్ న్యాయం చేశాడు. డ్యాన్స్, యాక్షన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. ఇక దివ్య పాత్రలో పాయల్ రాధాకృష్ణ ఒదిగిపోయింది. ఇది తనకు తొలి చిత్రమే అయినా.. ఆ విషయం తెరపై కనిపించకుండా నటించేసింది. దినేష్, పాయల్ల కెమిస్ట్రీ తెరపై చక్కగా పండింది. ఇక అను పాత్రకు హెబ్బా పటేల్ పూర్తి న్యాయం చేసింది. సెండాఫ్ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. రంగస్థలం మహేశ్, చమ్మక్ చంద్ర, ఝాన్సీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. సుభాష్ ఆనంద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం సినిమాకు ప్లస్ అయింది. కోడి బాయే లచ్చమ్మ పాటతో పాటు మిగతా సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అండ్రూ సినిమాటోగ్రఫీ సినిమాను రిచ్‌గా మార్చింది. ఎడిటర్ తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఆర్జీవీకి శ్రీదేవి ఎలానో..నాకు హెబ్బా అలానే: సాయి రాజేశ్
‘కుమారి 21 ఎఫ్’చిత్రం చూశాక నేను హెబ్బా పటేల్‌కి పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఆమె ఫోటోలను చూస్తూ ఉండిపోయేవాడిని. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేవాళ్లకి తెలుసు నేను హెబ్బాకి ఎంత పెద్ద అభిమానినో. రామ్ గోపాల్ వర్మకి శ్రీదేవి అంటె ఎంత ఇష్టమో..నాకు హెబ్బా అంటే కూడా అంతే ఇష్టం’ అని ‘బేబీ’ డైరెక్టర్ సాయి రాజేశ్ అన్నారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. నవంబర్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి సాయి రాజేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ‘దినేష్ చాలా మంచి వ్యక్తి. మంచి నటుడు. అతనికి సరైన బ్రేక్ రావాలి. బేబితో మా జీవితాలు మారిపోయాయి. ఈ చిత్రంతో దినేష్ లైఫ్ మారిపోవాలి. పాయల్ గారు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. హెబ్బా నాకు మంచి స్నేహితురాలు. తన మనసు చాలా మంచింది. సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఈ చిత్రం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నాడు. నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ..‘ఈ సినిమాకు హెబ్బా పటేల్ మెయిన్ ఎసెట్. సినిమాను భుజాల మీద మోసింది. సుభాష్ మ్యూజిక్, ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చాడు. చంద్రబోస్ గారు రాసిన ఆరు పాటలు, ఓ బిట్ అద్భుతంగా ఉంటాయి’ అన్నారు. ‘లవ్, కెరీర్ మధ్య జరిగే సంఘర్షణే ఈ మూవీ. ప్రేమను ఎంచుకోవాలా? కెరీర్‌ను ఎంచుకోవాలా? రెండూ ఎంచుకోవాలా? అన్నదే ఈ కథ. ఎమోషనల్‌గా వెంటాడుతుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా అదే ట్రాన్స్‌లో ఉంటారు. కన్నీళ్లతో బయటకు వస్తారు’ అని డైరెక్టర్ మారేష్ శివన్ అన్నారు. ఈ కార్యక్రమంలో దినేష్ తేజ్, పాయల్ రాధకృష్ణ తో పాటు చిత్రబృందం పాల్గొంది. -
‘అలా నిన్ను చేరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
చంద్రబోస్ సాహిత్యం అద్భుతం: సుభాష్ ఆనంద్
‘‘అలా నిన్ను చేరి’ సినిమాలోని ప్రతీ పాట అద్భుతంగా ఉంటుంది. ఒక్కో పాటను ఒక్కో శైలిలో కంపోజ్ చేసే చాన్స్ నాకు దొరికింది. నవరసాలను చూపించేలా ఇందులోని పాటలుంటాయి’’ అని సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ అన్నారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వం వహించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రమిది. ప్రేమ కథా చిత్రాలకు సంగీతమే ప్రాణం. నేను చాలా సినిమాలకు సంగీతం అందించాను. చంద్రబోస్ లాంటి లెజెండరీ వ్యక్తితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంటుంది. ‘అలా నిన్ను చేరి’ నా కెరీర్‌కి గుడ్ టర్న్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.