
గ్లామరస్ ఫొటోలు, కుటుంబంతో కలిసి ఆడిపాడిన క్షణాలను పోస్టుల రూపంలో పంచుకుంటుంది. అప్పుడప్పుడు తన అభిప్రాయాలను కూడా షేర్ చేసుకుంటుంది. వాటిని పలువురు విమర్శిస్తే కొంతమంది అనసూయకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక్కొక్కసారి నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానాలు కూడా ఇస్తూ ఉంటుంది అనసూయ. తాజాగా ఇలాంటి రిప్లై మళ్లీ ఇచ్చింది ఈ బ్యూటీఫుల్ యాంకర్.
Anasuya Bharadwaj Strong Counter To Netizen On Her Clothes: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు యాంకరింగ్.. ఇటు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోంది. యాంకరింగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలు, కుటుంబంతో కలిసి ఆడిపాడిన క్షణాలను పోస్టుల రూపంలో పంచుకుంటుంది. అప్పుడప్పుడు తన అభిప్రాయాలను కూడా షేర్ చేసుకుంటుంది. వాటిని పలువురు విమర్శిస్తే కొంతమంది అనసూయకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక్కొక్కసారి నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానాలు కూడా ఇస్తూ ఉంటుంది అనసూయ. తాజాగా ఇలాంటి రిప్లై మళ్లీ ఇచ్చింది ఈ బ్యూటీఫుల్ యాంకర్.
ఓ నెటిజన్ ట్విటర్‌లో 'అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా.. తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు' అంటూ అనసూయను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు అనసూయ స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చింది. ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ 'దయచేసి మీరు మీ పని చూసుకోండి.. నన్ను నా పని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అని అనసూయ దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా అనసూయ దర్జా, ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది.
చదవండి: ఆచార్య: కీలక పాత్రలో అనసూయ.. రెమ్యునరేషన్ ఎంతంటే ?
దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు 🙏🏻🙂 https://t.co/Uy4P00bmAE
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2022
చదవండి: అనసూయను టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది