Wearing Short Dress
-
ఆంక్షలను ధిక్కరిస్తూ.. లో దుస్తులతో నిరసన
టెహ్రాన్: బహిరంగంగా మహిళల వేషధారణపై కఠిన నిబంధనలు, కట్టుబాట్లను అమలుచేస్తున్న ఇరాన్లో ఓ విద్యార్థిని నిరసన గళం విప్పారు. ముఖం కనిపించకుండా సంప్రదాయ వస్త్రం ధరించలేదన్న కారణంగా టెహ్రాన్‌లో ఆ విద్యార్థినిపై బసీజ్ పారామిలటరీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. టెహ్రాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ ఇందుకు వేదికైంది. వాగ్వాదంలో బసీజ్ పారామిలటరీ సభ్యులు ఆ వర్సిటీ విద్యార్థిని దుస్తులు చింపేశారు. దీంతో ఆగ్రహంతో ఆ అమ్మాయి చిరిగిన బట్టలు పక్కన పడేసి లోదుస్తుల్లో తన నిరసన వ్యక్తంచేసింది. విద్యార్థినులపై కఠిన మత చట్టాలను అమలుచేయడమేంటని నిలదీసింది. అలాగే లోదుస్తుల్లో వందలాది విద్యార్థినీవిద్యార్థుల మధ్యలో వర్సిటీ ప్రాంగణంలో కలియ తిరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసింది. దీంతో సాధారణ దుస్తుల్లో వచి్చన పోలీసులు ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కారులో కుక్కి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. దీంతో ఆమె ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్ సంస్థ స్పందించింది. ‘‘ ఆమె ప్రస్తుతం ఎక్కడుందో ఎవరికీ తెలీదు. బేషరతుగా విద్యార్థిని తక్షణం విడుదలచేయాలి. ఆమెను పోలీసులు కొట్టడం, వేధించడం చేయొద్దు. కుటుంసభ్యులు, లాయర్‌తో మాట్లాడే అవకాశం కల్పించాలి. పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలి’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్ డిమాండ్ చేసింది. హిజాబ్ ధరించలేదంటూ మాసా అమినీ అనే యువతిని నైతిక పోలీసులు చిత్రవధ చేసి చంపడం, అది ఇరాన్లో భారీ నిరసనలకు దారితీయడం తెలిసిందే. -
మగజాతి పరువు తీస్తున్నారు: దిమ్మతిరిగేలా అనసూయ కౌంటర్
Anasuya Bharadwaj Strong Counter To Netizen On Her Clothes: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు యాంకరింగ్.. ఇటు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోంది. యాంకరింగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలు, కుటుంబంతో కలిసి ఆడిపాడిన క్షణాలను పోస్టుల రూపంలో పంచుకుంటుంది. అప్పుడప్పుడు తన అభిప్రాయాలను కూడా షేర్ చేసుకుంటుంది. వాటిని పలువురు విమర్శిస్తే కొంతమంది అనసూయకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక్కొక్కసారి నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానాలు కూడా ఇస్తూ ఉంటుంది అనసూయ. తాజాగా ఇలాంటి రిప్లై మళ్లీ ఇచ్చింది ఈ బ్యూటీఫుల్ యాంకర్. ఓ నెటిజన్ ట్విటర్లో 'అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా.. తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు' అంటూ అనసూయను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు అనసూయ స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చింది. ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ 'దయచేసి మీరు మీ పని చూసుకోండి.. నన్ను నా పని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అని అనసూయ దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా అనసూయ దర్జా, ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. చదవండి: ఆచార్య: కీలక పాత్రలో అనసూయ.. రెమ్యునరేషన్ ఎంతంటే ? దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు 🙏🏻🙂 https://t.co/Uy4P00bmAE — Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2022 చదవండి: అనసూయను టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది -
ఈ టైంలో అబ్బాయిలతో తిరుగుతున్నావెందుకని..
పుణె: 'ఎలా నువ్వు పొట్టి దుస్తులు వేసుకుంటావు? ఇంత సమయంలో ఇద్దరు మగాళ్లతో ఎలా తిరగగలుగుతున్నావు? పుణెలో ఇలాంటివి నడవవు' అని ఓ 22 ఏళ్ల యువతిని ఓ గ్యాంగ్ ప్రశ్నించింది. తెల్లవారుతుండగా ఈ ఘటన జరిగింది. అంతేకాదు.. ఆ యువతిని కారులో నుంచి బయటకు ఈడ్చి దాడి చేసింది. అనంతరం గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు గాయాలయ్యాయి. అయితే, ఘటన చోటుచేసుకున్న వారం తర్వాతగానీ పోలీసులు కేసు నమోదుచేయలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తన స్నేహితురాలి వివాహ కార్యక్రమానికి ముందు జరిగే సంగీత్‌లో పాల్గొనేందుకు డ్యాన్స్ రిహార్సల్స్ కోసం ఈ యువతి తన ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లొస్తుండగా ఆమె కారును మరోకారు ఫాలో అయింది. సరిగ్గా తెల్లవారు జామున 5.30గంటల ప్రాంతంలో ఆ కారులోని వ్యక్తులు ఆమె కారు డోర్ కొట్టారు. అనంతరం అందులోకి తొంగిచూశారు. ఆ వెంటనే అనకూడని మాటలు మొదలుపెట్టారు. అలా తిడుతూనే కారులోనే వెంబడించారు. కొద్ది దూరం వెళ్లాక కారును ఆపేశారు. ఆ యువతి స్నేహితుడు జోక్యం చేసుకోవడంతో అతడిపై చేయిచేసుకున్నారు. ఆ వెంటనే ఆ అమ్మాయిని కూడా అసభ్యకరంగా తిడుతూ కొట్టారు. ఈ సందర్భంగా తన స్నేహితులు లేకుంటే బహుషా వారు ఆరోజు తనపై లైంగిక దాడి కూడా చేసేవారని బాధితురాలు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి అమిత్ ముఖ్దేద్ కార్, శుభం గుప్తా అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.