ఈ టైంలో అబ్బాయిలతో తిరుగుతున్నావెందుకని.. | Woman Thrashed For 'Wearing Short Dress, Roaming With Men' | Sakshi
Sakshi News home page

ఈ టైంలో అబ్బాయిలతో తిరుగుతున్నావెందుకని..

Published Mon, May 9 2016 11:48 AM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM

ఈ టైంలో అబ్బాయిలతో తిరుగుతున్నావెందుకని..

ఈ టైంలో అబ్బాయిలతో తిరుగుతున్నావెందుకని..

పుణె: 'ఎలా నువ్వు పొట్టి దుస్తులు వేసుకుంటావు? ఇంత సమయంలో ఇద్దరు మగాళ్లతో ఎలా తిరగగలుగుతున్నావు? పుణెలో ఇలాంటివి నడవవు' అని ఓ 22 ఏళ్ల యువతిని ఓ గ్యాంగ్ ప్రశ్నించింది. తెల్లవారుతుండగా ఈ ఘటన జరిగింది. అంతేకాదు.. ఆ యువతిని కారులో నుంచి బయటకు ఈడ్చి దాడి చేసింది. అనంతరం గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు గాయాలయ్యాయి. అయితే, ఘటన చోటుచేసుకున్న వారం తర్వాతగానీ పోలీసులు కేసు నమోదుచేయలేదు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తన స్నేహితురాలి వివాహ కార్యక్రమానికి ముందు జరిగే సంగీత్లో పాల్గొనేందుకు డ్యాన్స్ రిహార్సల్స్ కోసం ఈ యువతి తన ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లొస్తుండగా ఆమె కారును మరోకారు ఫాలో అయింది. సరిగ్గా తెల్లవారు జామున 5.30గంటల ప్రాంతంలో ఆ కారులోని వ్యక్తులు ఆమె కారు డోర్ కొట్టారు. అనంతరం అందులోకి తొంగిచూశారు.

ఆ వెంటనే అనకూడని మాటలు మొదలుపెట్టారు. అలా తిడుతూనే కారులోనే వెంబడించారు. కొద్ది దూరం వెళ్లాక కారును ఆపేశారు. ఆ యువతి స్నేహితుడు జోక్యం చేసుకోవడంతో అతడిపై చేయిచేసుకున్నారు. ఆ వెంటనే ఆ అమ్మాయిని కూడా అసభ్యకరంగా తిడుతూ కొట్టారు. ఈ సందర్భంగా తన స్నేహితులు లేకుంటే బహుషా వారు ఆరోజు తనపై లైంగిక దాడి కూడా చేసేవారని బాధితురాలు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి అమిత్ ముఖ్దేద్ కార్, శుభం గుప్తా అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement