Malayalam Star Hero Prithviraj Sukumaran Plays Key Role In Mahesh Babu SSMB28 - Sakshi
Sakshi News home page

SSMB28-Mahesh Babu: మహేశ్‌-త్రివిక్రమ్‌ చిత్రంలో మలయాళ స్టార్‌ హీరో!

Published Mon, Oct 3 2022 8:54 AM | Last Updated on Mon, Oct 3 2022 11:13 AM

Malayalam Star Hero Prithviraj Sukumaran Plays Key Role in Mahesh Babu SSMB28 - Sakshi

తెలుగు సినిమాలపై మరింత ఫోకస్‌ పెట్టినట్లున్నారు మలయాళ దర్శక-నిర్మాత, నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ఇప్పటికే ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్‌’ చిత్రంలో పృథ్వీరాజ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. తాజాగా హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమాలో ఓ ప్రధాన పాత్రలో పృథ్వీనటించనున్నారట.

ఈ మేరకు ఆయనతో చిత్రయూనిట్‌ సంప్రదింపులు జరుపుతోందట. తన పాత్ర నచ్చడంతో పృథ్వీరాజ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేందుకు సముఖంగానే ఉన్నారని టాక్‌. కాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘అతడు’,‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement