Jr NTR And Trivikram Srinivas Project Cancelled? - Sakshi
Sakshi News home page

అయ్యో.. త్రివిక్రమ్‌-ఎన్టీఆర్‌ మూవీ లేనట్టేనా!

Published Tue, Apr 6 2021 11:03 AM | Last Updated on Tue, Apr 6 2021 1:23 PM

Is Jr NTR And Trivikram Srinivas Project Cancelled - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జేట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుత్ను ఈ మల్టిస్టారర్‌ చిత్రంలో ఎన్టీఆర్‌ కోమరంభీం పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం కీలక క్టైమాక్స్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం అక్టోబర్‌ 13న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌ పూర్తి కాగానే ఈ మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని ఇటీవల వార్తలు వచ్చాయి.

‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న మరో సినిమా కోసం అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ వాయిదా పడిందనేదే ఆ న్యూస్‌ సారాంశం. 

స్క్రిప్ట్‌ విషయంలో ఎన్టీఆర్‌ అసంతృప్తిగా ఉన్నాడని, ఆయన‌ కోసం మరోసారి స్క్రిప్ట్‌ రాసి కొత్త ప్రాజెక్ట్‌తో త్రివిక్రమ్‌ మూవీ తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టారనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఇక మరో విషయం ఏంటంటే ఎన్టీఆర్‌ అసంతృప్తితో ఉన్న ప్రాజెక్ట్‌ను త్రివిక్రమ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో తీయాలనే ఆలోచనట్లు ఉన్నట్లు సమాచారం. త్రివిక్రమ్‌-మహేశ్‌ కాంబోలో ‘ఖలేజా’ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ ఇంతవరకు మరో సినిమా తీయలేదు. దీంతో ఈ యంగ్‌ టైగర్‌ కోసం రెడీ చేసిన ఈ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు మహేశ్‌తో తీసే అవకాశం ఉందని సినీవర్గాల అభిప్రాయం.

అయితే ఇది ఎంతవరకు నిజమన్నది మాత్రం స్పష్టత లేదు. ఒకవేళ అదే నిజమైతే ఎన్టీఆర్‌ వదులుకున్న ఈ స్క్రిప్ట్‌ను ప్రిన్స్‌ ఒకే చేస్తాడో లేదో వేచి చూడాలి. కాగా ఎన్టీఆర్‌ ‘ఉప్పెన’ డైరెక్టర్‌ బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో ఓ మూవీ తీస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హిస్టారికల్‌ స్పోర్ట్స్‌‌ డ్రామా అయిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ 60 ఏళ్ల మాజీ ఆటగాడిగా కనిపించనున్నాడు. చెప్పాలంటే బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమిర్‌ ఖాన్‌ ‘దంగల్‌’ తరహాలో ఈ మూవీ ఉండబోతుందని వినికిడి.

చదవండి: 
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హరితేజ
సీనియర్‌ నటి వీడియో చూసి శివగామి కంటతడి!
ఆర్‌ఆర్‌ఆర్‌: ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.900 కోట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement