Music Director Thaman Out From Mahesh Guntur Karam Movie, Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

ఇప్పట్లో 'గుంటూరు కారం' కష్టాలు తీరవా..? మహేష్‌ క్లారిటీ ఇవ్వాల్సిందేనా?

Published Mon, Jul 24 2023 8:28 AM | Last Updated on Mon, Jul 24 2023 10:39 AM

Music Director Thaman Out From Mahesh Guntur Karam Movie - Sakshi

టాలీవుడ్‌ హీరో ప్రిన్స్‌ మహేష్‌ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసిందే. దీనికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా నాగవంశీ ఉన్నారు. సినిమా అనౌన్స్‌మెంట్‌ చేసిన రోజు నుంచి ప్రేక్షకులల్లో  మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాకు కేవలం డిజిటల్ హక్కులే  రూ. 80 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌ కొన్నదని ప్రచారం జరిగింది.  ఇంత  పాజిటివ్ ఎనర్జీతో వస్తున్న ఈ సినిమా చుట్టూ ఏదో ఒక సమస్య క్రియేట్‌ అవుతూనే ఉంది. దీంతో త్రివిక్రమ్​ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విషయంలో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్)

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ నుంచి  సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తప్పుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆయన ప్లేస్‌లో రవి కె చంద్రన్ పేరు వినిపిస్తోంది. ఇది నిజమేనని ఇండస్ట్రీలో టాక్‌. తాజాగా మరో షాకింగ్​ న్యూస్​ అభిమానులను కలవరపెడుతోంది. గతంలో తమన్‌ స్థానంలో వేరే మ్యూజిక్‌ డైరెక్టర్‌ని తీసుకుంటున్నారని వచ్చిన వార్తలపై.. అలాంటిదేమి లేదని నిర్మాత నాగవంశీతో పాటు తమన్‌ కూడా ఖండించారు. దీంతో ఈ సినిమాకు తమన్​ మ్యూజిక్‌ ఖాయం అని అంతా అనుకున్నారు.

అయితే తాజాగా మళ్లీ ఇదే విషయంలో మరోసారి రూమర్స్​​ నెట్టింట హల్​చల్ చేస్తున్నాయి. గుంటూరు కారం పాటలకు తమన్‌ ఇచ్చిన మ్యూజిక్‌ మహేష్‌ బాబుకు నచ్చలేదట. త్రివిక్రమ్‌ చెప్పారని మాత్రమే ఆయన్ను కొనసాగిస్తున్నారట. ఇక తప్పని పరిస్థితిలో తమన్‌ను పక్కన పెట్టాలని మేకర్స్‌ నిర్ణయించుకున్నారట. ఆయన ప్లేస్‌లోకి 'ఖుషి ఫేం హేశం అబ్దుల్ వహాబ్,  భీమ్స్ సిసిరిలియో'లను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇదే విషయాన్ని మహేష్‌ బాబు ముందు ఉంచారట మేకర్స్‌.  ఈ ప్రపోజల్​కు మహేష్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఇదే నిజమైతే సినిమా పాటలు మరింత హిట్‌ అవుతాయని ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు  మెలడీతో ప్రేక్షకులను మెప్పిస్తే.. మరోకరు మాస్ బీట్​తో దంచికొడతారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఫైట్ మాస్టర్స్‌, హీరోయిన్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ కంపోజర్, స్క్రిప్ట్‌లో మార్పు.. ఇలా మూవీకి కావాల్సిన కీలకమైన వాళ్ల విషయంలోనే ఇలాంటి ప్రచారం జరుగుతుంది.. వీటిలో ఇప్పటికే కొన్ని నిజం అయ్యాయి కూడా..  ఫైనల్‌గా గుంటూరు కారంలో ఎక్కడ తేడా కొడుతుందో అనేది ఎవరికీ అర్థం కావడం లేదని ఇండస్ట్రీలో టాక్‌. సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ కూడా త్రివిక్రమ్‌కు చాలా క్లోజ్‌. వీరిద్దరూ చాలా సినిమాలే చేశారు. అలాంటిది అతనే ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటే అసలు సమస్య మహేష్‌ కాదని, త్రివిక్రమ్‌ ధోరణితోనే చాలా సమస్య వస్తోందని పరిశ్రమలో టాక్‌. ఇవన్నీ క్లియర్‌ కావాలంటే మహేష్‌బాబు వివరణ ఇస్తే కానీ క్లారిటీ రాదు. ఫ్యాన్స్‌ కూడా ఇదే కోరుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement