NTR Trivikram Srinivas Upcoming Movie | ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌

Published Mon, Jan 4 2021 2:54 PM | Last Updated on Mon, Jan 4 2021 5:55 PM

Trivikram Srinivas To Approach Janhvi Kapoor For His Next Film With Jr NTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ సినిమాలో నటిస్తున్న జూనీయర్‌ ఎన్టీఆర్‌ ఆ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌‌తో మరోసారి జతకడుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌ తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ' సినిమా బ్లక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో మరోసారి ఎన్టీఆర్‌తో సినిమా తీసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్‌ సందర్భంగా ఎన్టీఆర్‌ను కలిసి కథ వివరించడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు ఎన్టీఆర్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ షూటింగ్‌ పూర్తికాగానే త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు రేడి అయ్యాడు. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారంట. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ హీరోయిన్‌గా రష్మిక మందన్న దాదాపు ఖరారైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక మరో కథానాయిక కోసం డైరెక్టర్‌ త్రివిక్రమ్‌.. దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను సంప్రదించినట్లు సమాచారం. (చదవండి: ఎన్టీఆర్‌ 30 రోలింగ్‌ సూన్)

ఒకవేళ అంతా ఓకే అయితే ఎన్టీఆర్‌ రెండవ హీరోయిన్‌గా జాన్వీ ఖారారైనట్లే. అయితే మూడవ హీరోయిన్‌ ఎవరన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రావల్సి ఉంది.  హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌లో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై యస్‌. రాధాకష్ణ, కల్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతాన్ని అందించనున్నారు. పోలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌, కన్నడ సూపర్‌ స్టార్‌ ఉపేంద్ర, మలయాళ నటుడు జయరామ్‌లు కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే వర్క్‌ టైటిల్‌ను కూడా అనుకుంటున్నట్లుగా చిత్ర యూనిట్‌ నుంచి సమాచారం. ఏప్రిల్‌లో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకేళ్లేందుకు దర్శకుడు త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం. (చదవండి: ఆ విషయంలో గిల్టీగా ఉంది: జాన్వీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement