మొన్న సుకుమార్.. ఇప్పుడు త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌తో కలిసి! | Allu Arjun Trivikram Pan India Movie Updates Latest | Sakshi

Allu Arjun: త్రివిక్రమ్‌తో బన్నీ పాన్ ఇండియా చిత్రం.. ఊహించని రేంజులో

Published Sat, Jul 20 2024 10:05 AM | Last Updated on Sat, Jul 20 2024 10:48 AM

Allu Arjun Trivikram Pan India Movie Updates Latest

గత కొన్నిరోజులుగా అల్లు అర్జున్ గురించి తెగ వార్తలొచ్చాయి. 'పుష్ప 2' షూటింగ్ విషయమై డైరెక్టర్ సుకుమార్‌తో గొడవపడ్డాడని, గడ్డం ట్రిమ్ చేయించుకుని ఫారెన్ టూర్‌కి వెళ్లిపోయాడని తెగ గాసిప్స్ వచ్చాయి. అయితే ఇవేవి నిజం కాదని నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చేశారు. దీనితోపాటు అల్లు అర్జున్ తర్వాత చేయబోయే మూవీ గురించి లీకులు వదిలారు.

(ఇదీ చదవండి: 'అందుకే బన్నీ గడ్డం ట్రిమ్‌ చేశాడు'.. నిర్మాత బన్నీ వాసు)

'పుష్ప 2' తర్వాత బన్నీ నెక్స్ట్ మూవీ ఏంటనేది క్లారిటీ రాలేదు. తాజాగా 'ఆయ్' మూవీ పాట లాంచ్ ఈవెంట్‌లో భాగంగా నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ తర్వాత సినిమా గురించి బయటపెట్టారు. త్రివిక్రమ్‌తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడని, ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏకంగా ఏడాదిన్నర సమయం పడుతుందని అన్నారు. కనివినీ ఎరుగని రీతిలో దేశంలో భారీ బడ్జెట్‌తో దీన్ని తీయబోతున్నారని చెప్పారు. ఈ రేంజులో చెబుతున్నారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

గతంలో 'రంగస్థలం' తర్వాత సుకుమార్ 'పుష్ప' మూవీ చేశారు. దీంతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్.. పాన్ ఇండియా లెవల్లో పరిచయం చేయనున్నాడు. ఒకవేళ ఈ మూవీ గనక హిట్ అయితే మాత్రం ఇప్పటివరకు తెలుగు వరకే పరిమితమైన త్రివిక్రమ్.. పాన్ ఇండియా వైడ్ పాపులర్ అయిపోవడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: మెగా- అల్లు ఫ్యామిలీకి గొడవలు.. నిర్మాత ఏమన్నారంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement