
‘గుంటూరు కారం’ మళ్లీ షురూ అంటున్నారు మహేశ్‌బాబు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొం దుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇందులో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 12న హైదరాబాద్‌లోప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులకు పైగా ఉంటుందట. ఈ షెడ్యూల్‌లో సినిమాలోని ప్రధాన తారాగాణంపాల్గొంటారని సమాచారం. ‘గుంటూరు కారం’ చిత్రం జనవరి 13న విడుదల కానుంది.