మరో సారి మహేశ్‌తో జతకట్టనున్న పూజా? | Pooja Hegde Again Act Mahesh Babu In Next Movie? | Sakshi
Sakshi News home page

మరో సారి మహేశ్‌తో జతకట్టనున్న పూజా?

Published Wed, Apr 7 2021 10:14 PM | Last Updated on Wed, Apr 7 2021 10:30 PM

 Pooja Hegde Again Act Mahesh Babu In Next Movie? - Sakshi

`మహర్షి` చిత్రంలో  సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. మరో సారి ఈ జంట వెండితెరపై జతకట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  వివరాల్లోకి వెళితే.. `అతడు`, `ఖలేజా` తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేశ్ ఓ సినిమా చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేశ్‌ నటిస్తున్న‌`సర్కారు వారి పాట` పూర్తి చేసి త్రివిక్రమ్ తో తదుపరి సినిమా పట్టాలెక్కించేందుకు‌ ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో మహేశ్ కి జంటగా పూజా నటించే అవకాశముందని టాలీవుడ్‌లో టాక్‌. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అలా జరిగితే ,అటు మహేశ్ తోనూ, ఇటు పూజతోనూ త్రివిక్రమ్‌కి ఇది మూడో సినిమా అవుతుంది. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` చిత్రాల్లో పూజనే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. కాగా, త్రివిక్రమ్ ప్రస్తుతం యంగ్ టైగర్ యన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందకు రానుంది.

( చదవండి: అప్పుడు వద్దనుకున్న బన్నీ...మరి ఇప్పుడెలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement