పూజా హెగ్డే ఈజ్ బ్యాక్.. త్రివిక్రమ్‌పై మళ్లీ ట్రోల్స్! | Pooja Hegde Unseen Pic From Guntur Kaaram Movie Sets Trending On Social Media, Netizens Trolls Trivikram - Sakshi
Sakshi News home page

Guntur Kaaram-Pooja Hegde: గురూజీని ఫ్రెష్‌గా ఆడేసుకుంటున్న మహేశ్ ఫ్యాన్స్

Published Sun, Mar 3 2024 5:17 PM | Last Updated on Sun, Mar 3 2024 6:37 PM

Guntur Kaaram Movie BTS Pics Pooja Hegde And Sreeleela - Sakshi

'గుంటూరు కారం' మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో డైరెక్టర్ త్రివిక్రమ్‌ని మహేశ్ ఫ్యాన్స్ మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకిలా చేశారు అని తెగ బాధపడుతున్నారు. అయితే ఇదంతా కూడా కేవలం రెండు ఫొటోల వల్లే వచ్చింది. మళ్లీ ఏమైంది? ఇప్పుడు ఏం జరుగుతోంది? 

మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమాగా 'గుంటూరు కారం' తీశారు. అప్పుడెప్పుడో 2021 మేలో లాంచ్ చేశారు. అప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్న పూజా హెగ్డేని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. కానీ షూటింగ్ లేటు అయ్యేకొద్ది స్టోరీ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్, సినిమాటోగ్రాఫర్ ఒక్కొక్కరుగా మారుతూ వచ్చారు. మరి పూజా హెగ్డేని తప్పించారో, తప్పుకొందో తెలీదు గానీ సినిమా నుంచి సైడ్ అయిపోయింది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది)

దీంతో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. మొన్నీమధ్ సంక్రాంతికి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాగా ఫ్యాన్స్ అయితే త్రివిక్రమ్‌ని మాములుగా ట్రోల్ చేయలేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరో దఫా ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు అప్పట్లో షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోల‍్ని ఎవరో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ఇందులో మహేశ్‌తో పాటు పూజా హెగ్డే కూడా కనిపించింది. ఈ ఫొటోల బట్టి చూస్తే శ్రీలీల చేసిన అమ్మూ పాత్ర పూజా చేయాల్సింది. మీనాక్షి చేసిన బుజ్జి పాత్ర శ్రీలీల చేయాలి. తాజాగా రిలీజైన ఫొటోల్లో పూజా లుక్ బాగుంది. దీంతో ఇంత మంచిగా ఉన్న హీరోయిన్‪‌ని ఎందుకు తీసేశార్రా బాబు అని నెటిజన్స్ దర్శకుడిని ట్రోల్ చేస్తున్నారు. అదీ సంగతి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement