Pooja Hegde And Samantha: Pooja Hegde Refused Trivikram And Mahesh Babu Movie - Sakshi
Sakshi News home page

Pooja Hegde-Samantha: క్రేజీ ప్రాజెక్ట్‌ను వదులుకున్న పూజ, ఆమె స్థానంలోకి సమంత

Published Thu, Nov 25 2021 1:42 PM | Last Updated on Thu, Nov 25 2021 5:43 PM

Pooja Hegde Refused Trivikram And Mahesh Babu Movie Then Samantha Said Yes - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ అనంతరం మహేశ్‌, త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నాడు. మహేశ్‌ బర్త్‌డే సందర్భంగా తివిక్రమ్‌ టీం #SSMB28 పేరుతో ఈ మూవీపై అధికారిక ప్రకటన ఇచ్చారు. కాగా ఈ చిత్రంలో మహేశ్‌కు జోడిగా బుట్ట బొమ్మ పూజ హెగ్డేను ఖరారు చేసినట్లు మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

చదవండి: షాకింగ్‌ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి?

ఈ తాజా బజ్‌ ప్రకారం.. పూజ ఈ ప్రాజెక్ట్‌ను వదులుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తను రాధేశ్యామ్‌, ‘ఆచార్య’, ‘బీస్ట్‌’, ‘సర్కస్‌’ చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక రాధేశ్యామ్‌, ఆచార్య షూటింగ్‌లు పూర్తి కాగా, బీస్ట్‌, సర్కస్‌ ఇంక చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. వీటితో పాటు పూజ చేతిలో మరిన్ని ప్రాజెక్ట్స్‌ కూడా ఉండటంతో మహేశ్‌-త్రివిక్రమ్‌ల సినిమాకు డేట్స్‌ సర్దుబాటు కావడంలేదట.

చదవండి: మరో వ్యక్తితో ఎఫైర్‌.. అందుకే విడిపోయాం : హీరో షాకింగ్‌ కామెంట్స్‌

దీంతో ఈ మూవీ నుంచి పూజ తప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పూజా నో చెప్పడంతో మేకర్స్‌ నేరుగా స్టార్‌ హీరోయిన్‌ సమంతను సంప్రదించగా.. దీని ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని వినికిడి. దీనిపై త్వరలోనే ప్రకటన కూడా వెలువడనుందట. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాంటే త్రివిక్రమ్‌ టీం స్పందించే వరకు వేచి చూడాలి. ఒకవేళ ఇదే నిజమైతే  ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ తర్వాత మహేశ్‌-సామ్‌ కాంబినేషన్‌లో రానున్న నాలుగో చిత్రమిది. 

చదవండి: పార్టీలో డ్యాన్స్‌తో హీరోయిన్‌ అక్క రచ్చ, ఛీఛీ.. కొంచం పద్దతిగా ఉండండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement