SSMB 28: Mahesh Babu, Trivikram movie to release on Sankranti 2024 - Sakshi
Sakshi News home page

Mahesh Babu: ఉగాదికి టైటిల్‌, సంక్రాంతికి సినిమా రిలీజ్‌..

Published Mon, Mar 20 2023 8:23 AM | Last Updated on Mon, Mar 20 2023 11:04 AM

Mahesh Babu, Trivikram Movie Get to Release on Sankranti 2024 - Sakshi

హీరో మహేశ్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి బాక్సాఫీస్‌ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ టాలీవుడ్‌లో లేటెస్ట్‌గా వినిపిస్తోంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్‌. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది.

మహేశ్‌బాబు, మలయాళ నటుడు జయరామ్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ సినిమాకి ‘అడవిలో అర్జునుడు’, ‘ఆమె కథ’, ‘అమ్మ కథ’ అనే టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 22న ఈ మూవీ టైటిల్‌ను అధికారికంగా రిలీజ్‌ చేయాలనే యోచనలో ఉన్నారట మేకర్స్‌. అలాగే ఈ మూవీని గతంలో దసరా సందర్భంగా రిలీజ్‌ చేయాలనుకున్నారు. అయితే తాజాగా సంక్రాంతికి రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉందట యూనిట్‌. కాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement