
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచులకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా మరోసారి త్రివిక్రమ్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోలీవుడ్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న సినిమా సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ధనుష్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.
ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు.ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇక తన స్పీచ్‌లో మూవీటీంపై ప్రశంసలు కురిపించిన త్రివిక్రమ్.. హీరోయిన్ సంయుక్త గురించి మాట్లాడుతూ.. అందరి ముందే ఆమెకు 'ఐ లవ్ యు' చెప్పేశారు. దీంతో ఈవెంట్‌కు వచ్చిన అభిమానులు ఈలలు, కేకలతో వేదికను హోరెత్తించారు. దాంతో ‘లేదండి బాబూ.. పూర్తిగా చెప్పేది వినండి.. కంగారు పడకండి అంటూ కాస్త కవర్ చేశారు త్రివిక్రమ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈవెంట్‌లో త్రివిక్రమ్ స్పీచ్ హైలైట్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment