Mahesh Babu Gives Clarify On Guntur Karam Movie Release Date Rumours, Deets Inside - Sakshi
Sakshi News home page

Mahesh Babu On Guntur Kaaram Release Date: పుకార్లకు చెక్ పెట్టిన సూపర్‌స్టార్ మహేశ్

Published Sun, Aug 20 2023 7:26 PM | Last Updated on Mon, Aug 21 2023 10:45 AM

Mahesh Babu Clarify Guntur Karam Movie Release Date  - Sakshi

సూపర్‌స్టార్ మహేశ్‌బాబుని స్క్రీన్‌పై చూసి ఏడాది దాటిపోయింది. 'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' చేస్తున్నాడు. దీని షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికీ పడుతూ లేస్తూ వచ్చింది. ఒకానొక దశలో అయితే ఈ మూవీ ఉంటుందా లేదా అని కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ పుకార్లపై స్వయంగా మహేశ్ స్పందించాడు.

మహేశ్, హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే 'గుంటూరు కారం' గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిచ్చిన మహేశ్.. 'సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ హ్యాపీగా ఉంటారు' అని చెప్పుకొచ్చాడు. అయితే ఇంతకీ 'గుంటూరు కారం' రిలీజ్ విషయంలో సందేహాలు ఎందుకొచ్చాయో తెలుసా?

(ఇదీ చదవండి: రజనీకాంత్ మరో రికార్డ్.. ఆ లిస్టులో ప్రభాస్‌తోపాటు)

మహేశ్-త్రివిక్రమ్ సినిమాను దాదాపు రెండేళ్ల క్రితమే మొదలుపెట్టారు. పూజా హెగ్డే హీరోయిన్ అన్నారు. మహేశ్‌తో ఓ ఫైట్ సీన్ తీశారు. అంతా బాగానే ఉంది అనుకునే టైంలో చాలా మార్పులు జరిగాయి. సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీలీల.. మెయిన్ లీడ్ అయింది. ఇప్పటివరకు జరిగిన పార్ట్ అంతా కాకుండా కొత్తగా షూటింగ్ స్టార్ట్ చేశారు. 

ఇవన్నీ కాదన్నట్లు ఇప్పటివరకు కేవలం లుక్స్‌తో పోస్టర్స్, చిన్న గ్లింప్స్ వీడియో తప్ప లిరికల్ సాంగ్స్ ఏం రాలేదు. అలానే సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం లాంటివి జరిగేసరికి సంక్రాంతి రిలీజ్ కష్టమే అని అభిమానులు కూడా అనుకున్నారు. కానీ మహేశ్ స్వయంగా జనవరి 12న పక్కా అని చెప్పడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. చూడాలి అనుకున్నట్లు ముగ్గుల పండక్కి తీసుకొస్తారో లేదో?

(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement