
హీరో మహేశ్‌బాబు కొత్త ఇంటికి వెళ్లనున్నారట. అయితే ఇది ఆయన నటిస్తున్న తాజా చిత్రం కోసమే. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 27 నుంచి హైదరాబాద్‌లో షురూ కానుందని తెలిసింది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ వేసిన ఓ ఇంటి సెట్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment