Meenakshi Chaudhary In Mahesh Babu's 'Guntur Karam' Movie - Sakshi
Sakshi News home page

Guntur Karam: మహేష్‌ బాబుతో గోల్డెన్‌ చాన్స్‌ కొట్టేసిన హాట్‌ బ్యూటీ

Published Mon, Jul 17 2023 11:26 AM | Last Updated on Mon, Jul 17 2023 11:38 AM

Mahesh Babu Guntur Karam Movie In Meenakshi Chaudhary - Sakshi

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు  హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘గుంటూరు కారం’ . ఇందులో పూజా హెగ్డే , శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్ట్‌ నుంచి పూజా తప్పుకుంది. ఈ సినిమాకు సంబంధించి  తాజాగా హీరోయిన్‌ మీనాక్షి చౌదరి ఈ మూవీకి సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ను లీక్‌ చేసింది.

(ఇదీ దచవండి: బిగ్‌బాస్‌లోకి ఈ జంట ఎంట్రీ ఖాయం.. వాళ్లకు బిగ్‌ సపోర్ట్‌ ఎవరో తెలిస్తే)

గుంటూరు కారం సినిమాలో తను నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.  తాజాగా  విజయ్ ఆంటోనీ సరసన హత్య అనే సినిమాలో హీరోయిన్‌గా నటించిన మీనాక్షి.. ఆ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గుంటూరు కారం సినిమా గురించి ఇలా మాట్లాడింది. 'నేను మహేష్ బాబు గారికి పెద్ద అభిమానిని. గుంటూరు కారం సినిమాలో నాకు అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మహేష్‌-త్రివిక్రమ్‌లది హిట్‌ పెయిర్‌. వారితో కలిసి నటించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూట్ కూడా పూర్తి అయింది.  మహేష్ గారి పక్కన మొదటి షాట్ చిత్రీకరణ ఎప్పటికీ మర్చిపోలేను.' అని మీనాక్షి తెలిపింది.

(ఇదీ చదవండి: ఆ లీడర్లను నమ్మొద్దు.. ఏపీ పాలిటిక్స్‌పై పూనమ్‌ కౌర్‌ సంచలన ట్వీట్‌)

ఈ ప్రాజెక్ట్‌ నుంచి పూజ హెగ్డే తప్పుకోవడంతో ఆ స్థానంలోకి శ్రీలీలను తీసుకొని మరొక హీరోయిన్‌గా  మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. హర్యానాకు చెందిన  మినాక్షి చౌదరి 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా రవితేజ ఖిలాడీ, హిట్ సినిమాలతో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement