Why Did Jr NTR, Trivikram Movie Get Shelved?, Details Here - Sakshi
Sakshi News home page

'ఎన్టీఆర్‌- త్రివిక్రమ్‌ మధ్య మనస్పర్థలు'.. అసలు ఏమైందంటే..

Published Mon, Jun 21 2021 4:02 PM | Last Updated on Mon, Jun 21 2021 4:33 PM

After Prashanth Neel JR Ntr Planning To Work With Trivikram  - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం ఆయన త్రివిక్రమ్‌తో ఖరారు చేసుకున్నారు. దీనికి 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్‌ను సైతం ఫైనలైజ్‌ చేశారు. అయితే అనూహ్యాంగా ఈ  ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. దీంతో ఎన్టీఆర్‌ కొరటాలతో సినిమా చేస్తుంటే, త్రివిక్రమ్‌ మహేష్‌బాబుతో సినిమా ప్లాన్‌ చేస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్‌ -త్రివిక్రమ్‌ల మధ్య మనస్థరలు వచ్చాయని, అందుకే ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందని వార్తలు గుప్పుమన్నాయి.

నిజానికి ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. త్రివిక్రమ్‌- ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో సినిమా ఆగిపోలేదని, ప్రస్తుతానికి జస్ట్‌ గ్యాప్‌ ఇచ్చారని సమాచారం. కొరటాల, ప్రశాంత్‌ నీల్‌తో సినిమా పూర్తవగానే వెంటనే త్రివిక్రమ్‌తో మూవీ పట్టాలెక్కనుందట. 'అరవింద సమేత' హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. 

చదవండి : తల్లి పాత్రలో అందాల నటి మనీషా కొయిరాల
'ఏక్ మినీ కథ' హీరోకు ఛాన్స్‌ ఇచ్చిన సుష్మిత కొణిదెల!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement