ప్రిన్స్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా ‘గుంటూరు కారం’ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. ముందుగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తీయాలనకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల దీనిని రీజనల్ మూవీగానే 2024లో సంక్రాతి కానుకగా విడుదల చేయనున్నారు.
(ఇదీ చదవండి: డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్‌కే ట్వీట్)
ఈ సినిమా కోసం మహేష్ రూ. 78 కోట్ల రూపాయలతో పాటు జిఎస్‌టిని అందుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ మన ఇండియా హీరోలు సుమారు వంద కోట్ల వరకు అందుకుంటున్నారు. కానీ మహేష్ బాబు రీజనల్ సినిమా కోసమే ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోనున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో గుంటూరు కారం సినిమాను నిర్మించనున్నారు.
(ఇదీ చదవండి: వాళ్లు అన్యాయం చేస్తే.. ఎంతవరకైనా వెళ్తా: గుణశేఖర్)
రీజనల్ సినిమాలకు సంబంధించి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వారి జాబితాలో మహేష్ బాబు టాప్‌లో ఉంటారు. ఈ సినిమా తర్వాత SS రాజమౌళి యొక్క SSMB 29 పాన్ ఇండియా సినిమా హిట్ట్ అయితే ఆయన రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమే.
Comments
Please login to add a commentAdd a comment