'దయచేసి ఆ పదాన్ని తీసేయండి'.. మహేశ్‌బాబుకు విజ్ఞప్తి! | Mahesh Babu Guntur Kaaram Movie Kurchi Madathapetti Song Promo Released, Netizens Reactions Inside - Sakshi
Sakshi News home page

Guntur Kaaram: 'దయచేసి ఆ పదాన్ని తీసేయండి'.. మహేశ్‌బాబుకు విజ్ఞప్తి!

Published Fri, Dec 29 2023 9:03 PM | Last Updated on Sat, Dec 30 2023 11:36 AM

Mahesh Babu Movie Guntur Kaaram Kurchi Madathapetti Song Promo - Sakshi

ఇప్పుడంతా ఎక్కడ చూసిన సోషల్ మీడియానే శాసిస్తోంది. ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లోనే వైరలవుతోంది. అలా కొన్నాళ్ల ముందు ఓ తాత తన మాటలతో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పిన 'కుర్చీ మడతపెట్టి' అనే డైలాగ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. డైలాగ్‌లో ఓ బూతు పదం కూడా ఉన్నప్పటికీ.. చాలామందికి ఇదో ఊతపదంలా మారిపోయింది. ఇప్పుడు దాన్నే పట్టుకుని ఏకంగా మాస్ పాట చేసేశారు. 

తాజాగా మహేశ్ బాబు నటించిన గుంటూరుకారం చిత్రంలోని పాటకు ఈ పదాన్ని వాడేశారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్‌గామారింది. అయితే ఈ చిత్రంలో కుర్చీని మడతబెట్టి పదం వినియోగించడంపై ఓ జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది మిమ్మల్ని ఫాలో అయ్యే మీలాంటి స్టార్‌ సినిమాలో ఈ బూతు పదాన్ని తొలగించాలని చిత్రబృందానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి బూతు పదాలు చూసి పిల్లలు చెడిపోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement