తెలుగులోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. కానీ హిట్ కొట్టి నిలబడేవాళ్లు మాత్రం చాలా తక్కువ. ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయిన బ్యూటీ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు శ్రీలీల. తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ అంతంతమాత్రంగా ఆడినప్పటికీ.. అవకాశాల మాత్రం వెల్లువలా వచ్చేశాయి.
(ఇదీ చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?)
గతేడాది 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీలీల.. ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ మోస్ట్ బిజీయెస్ట్ బ్యూటీ అయిపోయింది. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న 'గుంటూరు కారం'లోనూ శ్రీలీల వన్ ఆఫ్ ది హీరోయిన్. బుధవారం ఈమె బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.
ఈ లుక్ ప్రకారం విలేజీ బ్యూటీగా శ్రీలీల కనిపించనుంది. లంగా ఓణీలో కాలికి నెయిల్ పాలిష్ పెడుతున్న లుక్ ని రిలీజ్ చేశారు. ఇలా శ్రీలీలని చూస్తుంటే.. 'గుంటూరు కారం'లో హీరో మహేష్ బాబునే డామినేట్ చేస్తుందా అనిపించేలా ఉంది. త్రివిక్రమ్ తీస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. అలానే రామ్-బోయపాటి మూవీలో శ్రీలీల ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో మోడ్రన్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.
(ఇదీ చదవండి: కోపమొస్తే తల్లి అని కూడా చూడను, తిట్టేస్తా: శ్రీలీల)
Here’s wishing the extremely talented & gorgeous @sreeleela14 a very Happy Birthday! 🤩 - Team #GunturKaaram 🔥🌶️#HBDSreeLeela ✨
— Haarika & Hassine Creations (@haarikahassine) June 14, 2023
Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/pPFBZ9EQUf
Comments
Please login to add a commentAdd a comment