‘రామాయణం*లోకి త్రివిక్రమ్‌! | Trivikram To Enter In Ramayana Movie? | Sakshi
Sakshi News home page

‘రామాయణం*లోకి త్రివిక్రమ్‌!

Published Thu, Apr 4 2024 10:06 AM | Last Updated on Thu, Apr 4 2024 12:00 PM

Trivikram Enter In Ramayana Movie - Sakshi

మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లో 'రామయణ' పేరుతో సినిమా రానుంది.

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్‌బీర్‌కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ బాలీవుడ్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్‌ డైలాగ్స్‌ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు మేకర్స్‌ అప్పగించినట్లు సమాచారం. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు ఉండటంతో చిత్ర యూనిట్‌ ఆయన్ను సంప్రదించిందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

ఈ ఏడాదిలో 'గుంటూరు కారం'తో  ప్రేక్షకులను మెప్పించిన త్రివిక్రమ్‌ తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుందని గతంలో ఆయన చెప్పారు. అయితే బన్నీ 'పుష్ప2'తో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఒకవేళ ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత కూడా ఆయన అట్లీతో ఒక సినిమా ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రామాయణ టీమ్‌లోకి త్రివిక్రమ్‌ చేరడం దాదాపు లాంఛనమే అని చెప్పవచ్చు.  ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి రోజున ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే ఛాన్స్‌ వుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement