సాక్షి, విశాఖపట్నం: విశాఖలో హనీట్రాప్ కేసులో చిక్కుకున్న సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కపిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ త్రివిక్రమ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసుపై మంగళవారం సీపీ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు చెందిన హనీట్రాప్ కేసులో కపిల్‌పై కేసు నమోదు చేశాం. కపిల్ వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని సైబర్ ఫోరెన్సిక్‌కు పంపించాము. కానిస్టేబుల్ కపిల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం ప్రశ్నిస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన కపిల్ కుమార్ విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీలో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. తొలుత హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహంచి 2022 ఆగస్టు నెలలో విశాఖకు బదిలీపై వచ్చాడు.
ప్రస్తుతం అతడు సీఐఎస్‌ఎఫ్ ఫైర్ విభాగంలో పనిచేస్తునే పేస్‌బుక్ ద్వారా పరిచయమైన తమీషాతో మాట్లాడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తమీషా ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ముఖ్య నాయకుడి వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేస్తున్నట్లు గుర్తించడంతో కపిల్‌పై నిఘా పెట్టారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై అంతరంగిక భద్రత చట్టం కింద కేసులు పెట్టామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: పుంగనూరు దాడిలో చూపు కోల్పోయిన పోలీస్.. సీఎం జగన్ సాయం
Comments
Please login to add a commentAdd a comment