
మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను విదేశాల్లో జరపాలని ప్లాన్ చేస్తోందట చిత్రబృందం. కథ రీత్యా హీరో క్యారెక్టర్‌కు ఫారిన్ టచ్ ఉంటుందని సమాచారం. ఇందుకోసం యూకేలో కీలక షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట త్రివిక్రమ్.
ప్రస్తుతం ఇండియాలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందు ఫారిన్ షెడ్యూల్‌కు సంబంధించిన చిత్రీకరణను మొదలు పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ చేసిన ‘అతడు’లో ఆయన పాత్ర పేరు పార్థు అని గుర్తుండే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment