Is Singer Sunitha Makes Acting Debut With Mahesh, Trivikram SSMB28 Movie - Sakshi
Sakshi News home page

Singer Sunitha: నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్‌ సునీత! ఆ స్టార్‌ హీరోకి అక్కగా?

Published Thu, Dec 8 2022 1:32 PM | Last Updated on Thu, Dec 8 2022 2:47 PM

Is Singer Sunitha Makes Acting Debut With Mahesh, Trivikram SSMB28 Movie - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఆమె. స్టార్‌ హీరోయిన్లకు సమానమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఏకైక సింగర్‌ సునీత. ఇక ఆమె సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ ఉంటుంది. ఇదిలా ఉంటే సునీతకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటి వరకు తెర వెనక తన వాయిస్‌తో ఆకట్టుకున్న సునీత్ ఇప్పుడు వెండితెర ఎంట్రీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు సింగర్‌ స్టార్‌ గుర్తింపు పొందిన ఆమె త్వరలో నటిగా పరిచయం కాబోతున్నట్లు సమాచారం. ఈ తాజా బజ్‌ ప్రకారం ఆమె ఓ స్టార్‌ హీరో చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌-సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

#SSMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో ఓ కీ రోల్‌ కోసం దర్శకుడు త్రివిక్రమ్‌ సునీతను సంప్రదించారట. పాత్ర నచ్చటడం ఆమె వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. అయితే ఈ సినిమాలో సునీత, మహేశ్‌కు అక్కగా నటించనుందని వినికిడి. 

చదవండి: 
స్వాతి నా ఆల్‌ టైం క్రష్‌, అప్పటి నుంచి తనని చూస్తున్నా: డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌
ఒంటిపై బట్టలు కూడా సరిగా లేవు, ప్రాణభయంతో పరుగెత్తా: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement