
నార్త్ అండ్ సౌత్ ఇండస్ట్రీస్‌లో వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి. తెలుగులో ‘బ్రేకింగ్ న్యూస్’, ‘ది కేస్’ చిత్రాల్లో కీ రోల్స్ చేస్తున్నారు జేడీ. అలాగే తమిళంలో ‘కారీ’తో పాటు మరో సినిమాలో కీలక పాత్ర చేశారు. కన్నడంలో ‘ప్రేమ్’, ‘హూ’ మూవీస్‌లో జేడీ ముఖ్య పాత్రధారి. ఇక మలయాళంలోనూ రెండు చిత్రాలు కమిటయ్యారాయన.
సౌత్‌లో ఇంత బిజీగా ఉన్న జేడీ హిందీలోనూ వరుస చిత్రాలు చేస్తున్నారు. జాన్ అబ్రహాం ‘ఏక్ విలన్ 2’, ఆయుష్మాన్ ఖురాన్ ఫిల్మ్, ‘దహిని’ చిత్రాలు, టైటిల్ ఖరారు కానీ హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అన్నట్లు.. శనివారం (16.04.) జేడీ బర్త్‌డే. ‘శివ’ చిత్రం ద్వారా పరిచయమైన జేడీ నటుడిగా 33 ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఆ సినిమాలో చేసిన జేడీ పాత్రనే చక్రవర్తి ఇంటి పేరుగా మారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment