సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై చర్చలు, అంచనాలు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎన్‌టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రను విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి పోషిస్తున్నాడనే అంచనాలపై వర్మ స్పందించారు. ఆయన ప్రాతను జేడీ పోషించడం లేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. ఈ పాత్రను పోషిస్తున్నారనేది ఇంకా తనకు కూడా తెలియదంటూ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చారు. వైస్ రాయ్ హోటల్ డ్రామాలో చంద్రబాబు నాయుడు ప్రాతను జేడీ పోషించడంలేదు..ఇది నిజం ..అమ్మ, అమ్మమ్మమీద ఒట్టు అని తేల్చి పారేశారు.
కాగా గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు హీరో జేడీ చక్రవర్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న వార్తలొచ్చాయి. అయితే ఇవిఎంతమాత్రం నిజం కావని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ సంబంధించిన పనులు శరవేగంగా నడిపిస్తున్న వర్మ ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీంతోపాటు ఎన్టీఆర్ బయోపిక్ కోసం పరిశోధన మొత్తం పూర్తయిందని... ఎన్‌టీఆర్ ఆత్మే తనను నడిపిస్తోందంటూ.. ఈ సినిమాకు తనదైన శైలిలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment