RGVs film
-
మార్చి 2న ‘వ్యూహం' రిలీజ్
-
ప్రపంచ వ్యాప్తం గా వ్యూహం శపథానికి సిద్ధం! అవ్వుతున్న అభిమానులు
-
వైఎస్ మరణానంతర పరిణామాలే వ్యూహం సినిమా
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో చోటు చేసుకున్న పరిణామాలను ఏయే రాజకీయ పక్షం ఏ విధంగా తీసుకొని వ్యూహాలను చేసిందో అవే మా ‘వ్యూహం’ చిత్రం కథాంశమని ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. వ్యూహం చిత్ర షూటింగ్ విజయవాడ వద్ద కృష్ణానది పరిసర ప్రాంతాల్లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా తాడేపల్లి, ప్రకాశం బ్యారేజీ పరిసరాల్లో వ్యూహం చిత్రంలో జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకాశం బ్యారేజీపై నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం నుంచి చిత్ర కథాంశం ప్రారంభమవుతుందన్నారు. రెండు భాగాలుగా సినిమా చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. రెండు భాగాలను ఎన్నికలకు ముందే విడుదల చేస్తామన్నారు. విజయవాడ పరిసరాలతో పాటుగా గుంటూరు జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందన్నారు. చిత్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి పాత్ర కూడా ఉంటుందని చెప్పారు. ఎవరేమి సినిమాలు తీసినా తనకు అనవసరమని తెలిపారు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఉంటుందని పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఈ సినిమాలో చూపిస్తున్నట్లు చెప్పారు. తాను జగన్‌కు అభిమానినని, అయితే ఎవరి పైనా ద్వేషం లేదని చెప్పారు. వివేకానందరెడ్డి హత్య అంశం కూడా ఈ సినిమాలో ఉంటుందన్నారు. వివేకానంద హత్య కేసులో నిందితులను ప్రేక్షకులకు చూపిస్తానని వివరించారు. తాను తీసే సినిమాకు దాసరి కిరణ్‌కుమార్ నిర్మాతగా ఉన్నారని అంతే తప్పా తన వెనుక ఎవరూ లేరని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు పిలిచి అడిగినా దర్శకత్వం చేయనని ఒక ప్రశ్నకు జవాబు ఇచ్చారు. చిత్రానికి సంబంధించిన టీజర్‌ను స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఇచ్చే వాళ్లు ఉంటే హీరోలు రెమ్యూనేషన్ తీసుకోవడంలో తప్పు లేదన్నారు. ఎవరికి ఎంత అనేది మార్కెట్‌ను బట్టి నిర్మాత చూసుకుంటారన్నారు. -
బిగ్ బాస్ కి రమ్మని అడిగితే ఒక్కటే చెప్పా : RGV
-
RGV తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఆర్జీవీ మరో సంచలన ట్వీట్.. ఆయన వ్యూహమేంటో చెప్పేశారు..!
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అంటే ఓ సంచలనం. ఆయన ఏం చేసినా అందరి కంటే భిన్నంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ట్విటర్లో యాక్టివ్‌గా ఉండే వర్మ మరో సంచలనానికి తెరతీశాడు. అతి త్వరలోనే రాజకీయాలపై ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. వ్యూహం పేరుతో ఓ రాజకీయ సినిమా తీయనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇది బయోపిక్ కాదు … బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు శాతం నిజాలే ఉంటాయని స్పష్ట చేశారు. తాజాగా ఈ ఆయన తీయబోయే సినిమాపై చేసిన మరో ట్వీట్ తెగ వైరలవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌పై వివరణ ఇచ్చారు ఆర్జీవీ. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ఆర్జీవీ ప్రకటించారు. వంగవీటి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవాళ ట్వీట్లో ఆర్జీవీ ప్రస్తావిస్తూ.. 'BJP ÷ PK x CBN - LOKESH + JAGAN = వ్యూహం' అంటూ కొత్త అర్థం చెప్పారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదటి పార్ట్ “వ్యూహం” , రెండోది “శపథం” .రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుందంటూ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచారు. BJP ÷ PK x CBN - LOKESH + JAGAN = వ్యూహం — Ram Gopal Varma (@RGVzoomin) October 28, 2022 -
అమ్మాయిల ప్రేమకథ.. రామ్‌గోపాల్ వర్మ 'మా ఇష్టం'
Ram Gopal Varma Ma Ishtam Movie Released In April: రామ్ గోపాల వర్మ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనదైన శైలిలో వ్యంగంగా కామెంట్స్ చేస్తూ నిత్యం సినీ, రాజకీయ సెలబ్రెటీలను కవ్విస్తుంటాడు వర్మ. అందుకే ఆయన పెట్టే ప్రతి పోస్ట్, ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. కామెంట్స్ మాత్రమే కాకుండా విభిన్న సినిమాలు తెరకెక్కిస్తూ వివాదస్పదంగా మారిన సంఘటనలు సైతం ఉన్నాయి. తాజాగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మా ఇష్టం’. ఏప్రిల్ 8న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా ‘మా ఇష్టం’. భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి లెస్బియన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’’ అన్నారు. Directing the #DangerousGirls @NainaGtweets and @_apsara_rani pic.twitter.com/EsreAJJkw4 — Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2022 -
అమ్మ, అమ్మమ్మ మీద ఒట్టు...అది నిజంకాదు
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై చర్చలు, అంచనాలు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రను విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి పోషిస్తున్నాడనే అంచనాలపై వర్మ స్పందించారు. ఆయన ప్రాతను జేడీ పోషించడం లేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. ఈ పాత్రను పోషిస్తున్నారనేది ఇంకా తనకు కూడా తెలియదంటూ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చారు. వైస్ రాయ్ హోటల్ డ్రామాలో చంద్రబాబు నాయుడు ప్రాతను జేడీ పోషించడంలేదు..ఇది నిజం ..అమ్మ, అమ్మమ్మమీద ఒట్టు అని తేల్చి పారేశారు. కాగా గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు హీరో జేడీ చక్రవర్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న వార్తలొచ్చాయి. అయితే ఇవిఎంతమాత్రం నిజం కావని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ సంబంధించిన పనులు శరవేగంగా నడిపిస్తున్న వర్మ ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీంతోపాటు ఎన్టీఆర్ బయోపిక్ కోసం పరిశోధన మొత్తం పూర్తయిందని... ఎన్టీఆర్ ఆత్మే తనను నడిపిస్తోందంటూ.. ఈ సినిమాకు తనదైన శైలిలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
పూనమ్ కౌర్ ... వర్మ 'శ్రీదేవి' కాదు
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంతో తెరకెక్కుతున్న చిత్రం శ్రీదేవి. ఆ చిత్రంలో ముఖ్య పాత్రని ప్రముఖ నటీ పూనమ్ కౌర్ పోషిస్తున్నారు. ఆ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభమైంది. రెండు రోజులు షూటింగ్ తర్వాత ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రకటించారని సమాచారం. కథ చెప్పిన సమయంలో టీనేజ్ కుర్రాడు అని చెప్పి... చిత్రంలో నటించే సమయంలో 10 ఏళ్ల వయస్సు గల ప్రణీత్‌తో నటింప చేస్తారా అని రామ్‌గోపాల్ వర్మను పూనమ్ కౌర్ ప్రశ్నించినట్లు సమాచారం. ఈ అంశంపై తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారని సమాచారం. సావిత్రి పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్లు మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో మహిళ సంఘాలు వర్మపై నిప్పులు కక్కాయి. దాంతో వర్మ 'సావిత్రి'ని పక్కన పెట్టి శ్రీదేవి పేరును ఖరారు చేశాడు. ఆ చిత్రానికి శ్రీదేవి పేరు ఖరారు చేయడంపై ప్రముఖ నటీ శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై శ్రీదేవి... రామ్ గోపాల్ వర్మకు కోర్టు ద్వారా నోటీసులు జారీ చేసింది. అయినా తాను శ్రీదేవి పేరుతో చిత్రాన్ని నిర్మించి తీరుతానని వర్మ బహిరంగ ప్రకటన చేశారు. ఓ టీచర్, ఓ విద్యార్థి మధ్య నడిచే కథనాన్ని ఇతివృత్తంగా తీసుకుని రామ్‌గోపాల్ వర్మ శ్రీదేవి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.