అమ్మాయిల ప్రేమకథ.. రామ్​గోపాల్​ వర్మ 'మా ఇష్టం' | Ram Gopal Varma Ma Ishtam Movie Released In April | Sakshi
Sakshi News home page

RGV Ma Ishtam Movie: అమ్మాయిల ప్రేమకథ.. రామ్​గోపాల్​ వర్మ 'మా ఇష్టం'

Published Sat, Feb 26 2022 11:29 AM | Last Updated on Sat, Feb 26 2022 11:39 AM

Ram Gopal Varma Ma Ishtam Movie Released In April - Sakshi

Ram Gopal Varma Ma Ishtam Movie Released In April: రామ్‌ గోపాల వర్మ.. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనదైన శైలిలో వ్యంగంగా కామెంట్స్‌ చేస్తూ నిత్యం సినీ, రాజకీయ సెలబ్రెటీలను కవ్విస్తుంటాడు వర్మ. అందుకే ఆయన పెట్టే ప్రతి పోస్ట్‌, ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. కామెంట్స్​ మాత్రమే కాకుండా విభిన్న సినిమాలు తెరకెక్కిస్తూ వివాదస్పదంగా మారిన సంఘటనలు సైతం ఉన్నాయి.

తాజాగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మా ఇష్టం’. ఏప్రిల్‌ 8న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్‌ అంశాలతో క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా ‘మా ఇష్టం’. భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి లెస్బియన్‌ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’’ అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement