Director Ram Gopal Varma Tweet On His Latest Movie - Sakshi
Sakshi News home page

RGV Tweet: ఆర్జీవీ మరో సంచలన ట్వీట్.. ఆయన వ్యూహం ఇదే..!

Published Fri, Oct 28 2022 3:16 PM | Last Updated on Fri, Oct 28 2022 5:22 PM

Director Ramgopal Varma Tweet On His Latest Movie - Sakshi


దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అంటే ఓ సంచలనం. ఆయన ఏం చేసినా అందరి కంటే భిన్నంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే వర్మ మరో సంచలనానికి తెరతీశాడు. అతి త్వరలోనే రాజకీయాలపై ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. వ్యూహం పేరుతో ఓ రాజకీయ సినిమా తీయనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇది బయోపిక్ కాదు … బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు శాతం నిజాలే ఉంటాయని ‍స్పష్ట చేశారు.

తాజాగా ఈ ఆయన తీయబోయే సినిమాపై చేసిన మరో ట్వీట్ తెగ వైరలవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌పై వివరణ ఇచ్చారు ఆర్జీవీ. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ఆర్జీవీ ప్రకటించారు. వంగవీటి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన దాసరి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవాళ ట్వీట్‌లో ఆర్జీవీ ప్రస్తావిస్తూ.. 'BJP ÷ PK  x CBN - LOKESH  + JAGAN = వ్యూహం' అంటూ కొత్త అర్థం చెప్పారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదటి పార్ట్ “వ్యూహం” , రెండోది “శపథం” .రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు   పుష్కలంగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే  వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుందంటూ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement