
జేడీ చక్రవర్తి హీరోగా ఎన్.ఎస్.సి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమ్.ఎమ్.ఓ.ఎఫ్ (MMOF).ఆర్ ఆర్ ఆర్ ప్రొడక్షన్స్ & జె కే క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి అనుశ్రీ సమర్పణలో రాజశేఖర్,ఖాసీంలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్రిల్లర్‌గా అలరించింది. తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మార్చి 22 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయింది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. సినిమా అమెజాన్ లో విడుదల అయిందని.. తప్పకుండా ఈ సినిమాని చూడండి.. ప్రేక్షకులు కోరుకునే అన్నీ అంశాలు సినిమాలో ఉన్నాయి..థ్రిల్లర్ జొనర్ లో ఇదో కొత్త తరహా చిత్రంగా ఉంటుంది.. ఇది మిస్ అయితే ఓ మంచి థ్రిల్లర్ మిస్ అవుతారు..మంచి సస్పెన్స్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను అన్నారు
కథ విషయానికి వస్తే..దీపక్ అనే అతను ఖార్ఖాన ఏరియా లో ఓ థియేటర్ నడుపుతుంటాడు..అందులో ఎక్కువ గా అడల్ట్ సినిమాలు ఆడిస్తుంటాడు..అయితే సడన్‌గా ఆ థియేటర్ లో సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళు చనిపోతుంటారు.అసలు ఆ థియేటర్ లో ఏముంది? ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? అనే సస్పెన్స్ అంశాలతో కథ నడుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment