ఆ డైరెక్టర్‌ మూవీలో జేడీ చక్రవర్తి.. ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్! | Aishwarya Rajesh Acts With JD Chakrabarthy In 'Karuppar Nagaram' | Sakshi
Sakshi News home page

Aishwarya Rajesh: ఆ డైరెక్టర్ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్‌..!

Published Thu, Nov 9 2023 4:12 PM | Last Updated on Thu, Nov 9 2023 4:28 PM

Aishwarya Rajesh Acts In Karuppar Nagaram With JD Chakrabarthy - Sakshi

మొదట క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణించి ఆ తరువాత కథానాయకిగా అయిన నటి ఐశ్వర్యా రాజేశ్. హీరోయిన్ అయిన చాలా తక్కువ కాలంలోనే లేడీ హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలే నటిగా ఎదిగిన ఈమె ఇటీవల టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కాగా పాత్రల ఎంపికలో తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అలా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఐశ్వర్య రాజేశ్.. తాజాగా గోపీ నయినార్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. 

(ఇది చదవండి: మొన్న ఐటం సాంగ్‌.. ఇప్పుడు సూపర్‌ స్టార్‌ సినిమాలో ఛాన్స్‌)

ఈ దర్శకుడు ఇంతకు ముందే నయనతార ప్రధాన పాత్రలో నటించిన అరమ్‌ అనే సక్సెస్‌పుల్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా తయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటుడు జయ్‌ కథా నాయకుడిగా నటిస్తున్నారు. నటుడు జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తోన్న.. ఈ చిత్రంలో  నటి ఈశ్వరీరావు, జాన్‌విజయ్‌, సుబ్బు పంజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కేఎస్‌.ప్రసాద్‌ సంగీతమందిస్తుండగా.. ఈ చిత్రాన్ని ఏజీఎల్‌ పతాకంపై ఆర్‌.రమేశ్‌ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి కరుప్పర్‌ నగరం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ టైటిల్‌ పేరును దర్శకుడు వెంకట్‌ప్రభు ట్విటర్ ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. 

(ఇది చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement