లవ్‌ టుడే హీరో మరో చిత్రం.. ఆ సూపర్ హిట్‌ కాంబో రిపీట్! | Love Today Hero Pradeep Ranganathan Another Film With AGS, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Love Today: హీరోగా మారిన డైరెక్టర్‌.. మళ్లీ ఆ క్రేజీ కాంబో!

Apr 12 2024 8:53 AM | Updated on Apr 12 2024 10:40 AM

Love Today Hero Pradeep Ranganathan Another Film With AGS - Sakshi

నటుడు జయంరవి హీరోగా నటించిన కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్‌ కొట్టిన ప్రదీప్‌ రంగనాథన్‌ ఆ తరువాత లవ్‌టుడే చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి సూపర్‌హిట్‌ను అందుకున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా ఇదే సంస్థలో ప్రదీప్‌ రంగనాథన్‌ మరోసారి కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా తన కాలేజ్‌మేట్‌ అశ్వంత్‌ మారిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

ఆయన ఇంతకుముందు కొన్ని షార్ట్‌ ఫిలింస్‌ చేశారు. దీని గురించి ఏజీఎస్‌ సంస్థ నిర్వాహకులు గురువారం ఒక వీడియోను విడుదల చేశారు. అందులో నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ తన కాలేజ్‌మేట్‌, మిత్రుడు అశ్వంత్‌ మారిముత్తుతో కలిసి చిత్రం చేయాలన్నది దశాబ్దం కల అని పేర్కొన్నారు. అది ఇప్పటికి నెరవేరబోతోందని అన్నారు. కాగా ఈయన ప్రస్తుతం విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో ఎల్‌ఐసీ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. 

ఆ తరువాత ఏజీఎస్‌ ఎంటర్‌టైయిన్‌మెంట్‌ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించనున్నారు. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 26వ చిత్రం అవుతుంది. ఈ చిత్రం షూటింగ్‌ మే నెలలో ప్రారంభం కానుందని చెప్పారు. కాగా ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ ప్రస్తుతం విజయ్‌ హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో గోట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement