'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై వర్మ క్లారిటీ | Ram Gopal Varma clarity on Lakshmis NTR Producer | Sakshi
Sakshi News home page

'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై వర్మ క్లారిటీ

Published Tue, Sep 26 2017 1:52 PM | Last Updated on Tue, Sep 26 2017 1:54 PM

Ram Gopal Varma clarity on Lakshmis NTR Producer

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు వివాదాస్పద పోస్ట్ లు చేసిన రామ్ గోపాల్ వర్మ తాజాగా సినిమా నిర్మాత గురించి వస్తున్న వార్తలను ఖండించారు. కొద్ది రోజులుగా రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కు నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి నిర్మాత అన్న ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తలపై స్పందించిన వర్మ, తన సోషల్ మీడియా పేజ్ లో క్లారిటీ ఇచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కు జేడీ చక్రవర్తి నిర్మాత అన్న వార్తలు పుకార్లే అన్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించటంలో మంచి రికార్డ్ ఉన్న వర్మ, ఎన్టీఆర్ జీవితంలోని ఎత్తు పల్లాలను వెండితెర మీద ఆవిష్కరించనున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement