Senior Hero JD Chakravarthy Talk About Dayaa Web Series - Sakshi
Sakshi News home page

అందుకే దయా వెబ్‌ సిరీస్‌లో నటించాను : జేడీ చక్రవర్తి

Published Wed, Aug 2 2023 4:50 PM | Last Updated on Wed, Aug 2 2023 5:41 PM

Senior Hero JD Chakravarthy Talk About Dayaa Web Series - Sakshi

బాలీవుడ్‌నాకు పొరుగు ఇల్లు లాంటిది. అందుకే కొంతకాలం అటువైపు వెళ్లి వచ్చా. నా బలం మాత్రం ఎప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమనే’ అని సీనియర్‌ హీరో జేడీ చక్రవర్తి అన్నారు. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘దయా’.పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌ ఆగస్ట్‌ 4నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్క్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో జేడీ చక్రవర్తి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

కంటెంట్ ఈజ్ ది ప్రిన్స్, డైరెక్టర్ ఈజ్ కింగ్ అని నమ్మే నటుడిని నేను. దయా అనే కథను దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన విధానం ఆకట్టుకుంది. అందుకే ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించాను. కథ మనకున్న స్థలం లాంటిదైతే..అందులో అందమైన ఇళ్లు కట్టడం డైరెక్షన్ లాంటిది. సినిమా అనే సౌధాన్ని అందంగా నిర్మించడం దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది.

 ఏ దర్శకుడైనా పది నిమిషాల్లో కథ చెప్పగలిగితే అతనికి ఆ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్నట్లు అని ఆర్జీవీ అనేవారు. పవన్ ఫోన్ లో 10 మినిట్స్ స్టోరీ చెప్పినప్పుడే అతనికి కథ మీద ఉన్న పట్టు తెలిసింది. దాంతో ఫుల్ నెరేషన్ వినకుండానే ఓకే చెప్పాను.

► దయా వెబ్ సిరీస్ కు దర్శకుడు పవన్ పెద్ద బలం. ఇందులో క్యారెక్టర్స్ ఒక స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. ప్రతి క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది. నటీనటులకు గుర్తింపు తెచ్చే పాత్రలు ఇందులో ఉంటాయి. నా మొదటి సినిమా శివతోనే నేను జేడీ అయిపోయా. అలాగే బాహుబలిలో సత్యరాజ్ ను కట్టప్పగానే గుర్తుంచుకుంటాం. ఇలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్న వెబ్ సిరీస్ దయా. లొకేషన్స్, క్యారెక్టర్స్, స్క్రిప్ట్ అన్నీ బాగా కుదిరిన సిరీస్ ఇది.

► దయాలో నేను ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ ను. చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం నా పని. దయా వరల్డ్ ను ప్రారంభం నుంచీ 10, 12 నిమిషాల పాటు ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడు. ఆ  ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ కు ఒకరోజు అమ్మాయి శవం కనిపిస్తుంది. పోలీసులకు చెప్పేంత ధైర్యం అతనిలో ఉండదు. ఈ భయంలో ఉండగానే ఇంకో శవం దొరుకుతుంది. సాదాసీదా జీవితం గడిపే ఆ డ్రైవర్ జీవితాన్ని ఈ ఘటనలు మలుపుతిప్పుతాయి. ఆ ఎమోషన్స్ అన్నీ దయాలో చూస్తారు. 

 ఓటీటీలో స్టార్  డమ్ ను  కౌంట్ చేయలేము అనడం సరికాదు. సినిమా ఎంత సక్సెస్ అయ్యింది అనేందుకు థియేటర్ లో మనకు కలెక్షన్స్ లెక్కిస్తాం. కానీ ఓటీటీలో ఎంతమంది చూశారు అనేది కొలమానం. కథను సినిమాలో కంటే విస్తృతంగా చెప్పేందుకు వెబ్ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. వెబ్ సిరీస్ లో కొత్త వాళ్లకూ ఆదరణ దక్కుతుంది. వాళ్లనూ రిసీవ్ చేసుకుంటారు. కానీ థియేటర్ లో స్టార్స్ సినిమాలకు మాత్రమే బయ్యర్స్ ఉంటారు. ఇది ఓటీటీకున్న అడ్వాంటేజ్. నేను జేడీ చక్రవర్తి కాకుండా కొత్త నటుడిగా దయాలో చూస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement