Dayaa Web Series
-
వైజాగ్..నా కెరీర్‌ని మార్చేసింది: జేడీ చక్రవర్తి
మద్దిలపాలెం (విశాఖతూర్పు): ‘నా సినీ జీవితాన్ని మలుపు తిప్పింది వైజాగ్. నా చిత్రాలకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు విశాఖ వాళ్లే. అందుకే వైజాగ్ అంటే ప్రాణం. ఇది నా లక్కీ సిటీ అని ప్రముఖ హీరో జేడీ చక్రవర్తి అన్నారు. ‘దయ’తో ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లో తొలిసారిగా నటించానన్నారు. విశాఖ వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే.. ‘గులాబి’తో స్టార్ స్టేటస్ కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబి చిత్రంతో స్టార్ స్టేటస్ లభించింది. ఈ చిత్రం విశాఖలో చిత్రీకరణ జరుపుకుంది. మేఘాలలో తేలిపోమన్నది పాట చిత్రీకరణ పాడేరు కాఫీతోటల సమీపంలో చిత్రీకరించామని, ఆ పాట ఎప్పుడు విన్నా ఈ ప్రాంతం గుర్తుకు వస్తుందన్నారు. దాదాపు ఈ చిత్రమంతా వైజాగ్ పరిసరాల్లో షూటింగ్ జరిపామన్నారు. గులాబి నా సినీ జీవితాన్ని మలుపు తిప్పిందన్నారు. వైజాగ్ అంటే ప్రాణం విశాఖ ప్రేక్షకులు సినిమాలను విశేషంగా ఆదరిస్తారని, ఇక్కడ టాక్ బాగుంటే ఆ సినిమా సూపర్ హిట్టే. తాను నటించిన గులాబి, సత్య సూపర్ హిట్ చేశారని, తొలిసారిగా నటించిన ‘దయ’ వెబ్ సిరీస్‌ను కూడా ఆదరించాలని కోరారు. దయ ప్రమోషన్ ఇక్కడ నుంచే.. దయ వెబ్ సిరీస్ ప్రమోషన్ నా లక్కీ సిటీ వైజాగ్ నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు పవన్ సాధినేని రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌ను 24 గంటల్లోనే ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక్కడ వాళ్లు దయ చూశామని, చాలా బాగుందని చెబుతుండడం ఆనందంగా ఉంది. ఇది నా సెకెండ్ ఇన్నింగ్స్‌కు శుభసూచికంగా భావిస్తున్నా. మూడు భాషల్లో వెబ్ సిరీస్‌లో నటిస్తున్నా.. ప్రస్తుతానికి రెండు హిందీ, ఒక తెలుగు, తమిళ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను. అలాగే మూడు చిత్రాల్లో నటిస్తున్నా. వాటిలో రెండు తెలుగు చిత్రాలు కాగా, ఒకటి తమిళ చిత్రం. రాజకీయాలకు దూరం రాజకీయాలంటే ఆసక్తే కాని, ప్రత్యక్షంగా ఆ రంగంలోకి వచ్చే ఆలోచనే లేదు. ప్రస్తుతం మంచి చిత్రాలతో అభిమానులను అలరించాలన్నదే నా లక్ష్యం. ఆర్జీవీ నా గురువు రాంగోపాల్ వర్మ నాకు గురువు. చాలా మంది రామూ మీ ఫ్రెండ్ కదా అంటుంటారు. ఆయన జీనియస్..ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. దయ వెబ్ సిరీస్ చూసి ఆదరించండి. చక్కని థ్రిల్ కలిగించే క్రైమ్ వెబ్ సిరీస్. మంచి స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. -
విశాఖపట్నంలో సందడి చేసిన జేడీ చక్రవర్తి (ఫొటోలు)
-
ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్
ఎప్పటిలానే మరో వీకెండ్. ఈసారి థియేటర్లలో దాదాపు 10 వరకు చిన్న చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిలో ధోనీ నిర్మించిన 'ఎల్‌జీఎమ్' తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేవు. దీంతో మూవీ లవర్స్ ఓటీటీల వైపు చూస్తున్నారు. వాళ్ల కోసమా అన్నట్లు ఈసారి దాదాపు 18 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కు సిద్ధమైపోయాయి. దిగువన ఉన్న ఆ జాబితానే. ఇందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి అని చెప్పినవన్నీ ఈ రోజు అంటే గురువారం రిలీజ్ అయ్యాయి అని. మిగతావన్నీ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్నాయని అర్థం. మరి ఇంకెందుకు లేటు.. ఈ వీకెండ్ ఏం చూడాలో ప్లాన్ ఫిక్స్ చేసుకోండి. వీటిలో రంగబలి, పరేషాన్ సినిమాలకు తోడు 'దయ' వెబ్ సిరీస ఆసక్తి కలిగిస్తున్నాయి (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ) ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ హాట్‌స్టార్ దయ - తెలుగు వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద లాస్ట్ ఫ్లవర్స్ ఆఫ్ ఎలైస్ హర్ట్ - ఇంగ్లీష్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఫేటల్ సెడక్షన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ రంగబలి - తెలుగు సినిమా ద బిగ్ నైల్డ్ ఇట్ బేకింగ్ ఛాలెంజ్ - ఇంగ్లీష్ సిరీస్ ద హంట్ ఫర్ వీరప్పన్ - హిందీ సిరీస్ చూనా - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) హెడ్ టూ హెడ్ - అరబిక్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) హార్ట్ స్టాపర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) ద లాస్ట్ అవర్స్ ఆఫ్ మారియో బ్యూయోండో - స్పానిష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) సోనీ లివ్ ఫటాఫటీ - బెంగాలీ మూవీ పరేషాన్ - తెలుగు సినిమా బుక్ మై షో లాస్ట్ & ఫౌండ్ - ఇంగ్లీష్ చిత్రం సైలెంట్ హవర్స్ - ఇంగ్లీష్ మూవీ టూ క్యాచ్ కిల్లర్ - ఇంగ్లీష్ సినిమా ఆహా హైవే - తమిళ సినిమా సైనా ప్లే డార్క్ షేడ్స్ ఆఫ్ సీక్రెట్ - మలయాళ సినిమా (ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక) -
బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటిది: జేడీ చక్రవర్తి
బాలీవుడ్నాకు పొరుగు ఇల్లు లాంటిది. అందుకే కొంతకాలం అటువైపు వెళ్లి వచ్చా. నా బలం మాత్రం ఎప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమనే’ అని సీనియర్ హీరో జేడీ చక్రవర్తి అన్నారు. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘దయా’.పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 4నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్క్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో జేడీ చక్రవర్తి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కంటెంట్ ఈజ్ ది ప్రిన్స్, డైరెక్టర్ ఈజ్ కింగ్ అని నమ్మే నటుడిని నేను. దయా అనే కథను దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన విధానం ఆకట్టుకుంది. అందుకే ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించాను. కథ మనకున్న స్థలం లాంటిదైతే..అందులో అందమైన ఇళ్లు కట్టడం డైరెక్షన్ లాంటిది. సినిమా అనే సౌధాన్ని అందంగా నిర్మించడం దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ► ఏ దర్శకుడైనా పది నిమిషాల్లో కథ చెప్పగలిగితే అతనికి ఆ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్నట్లు అని ఆర్జీవీ అనేవారు. పవన్ ఫోన్ లో 10 మినిట్స్ స్టోరీ చెప్పినప్పుడే అతనికి కథ మీద ఉన్న పట్టు తెలిసింది. దాంతో ఫుల్ నెరేషన్ వినకుండానే ఓకే చెప్పాను. ► దయా వెబ్ సిరీస్ కు దర్శకుడు పవన్ పెద్ద బలం. ఇందులో క్యారెక్టర్స్ ఒక స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. ప్రతి క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది. నటీనటులకు గుర్తింపు తెచ్చే పాత్రలు ఇందులో ఉంటాయి. నా మొదటి సినిమా శివతోనే నేను జేడీ అయిపోయా. అలాగే బాహుబలిలో సత్యరాజ్ ను కట్టప్పగానే గుర్తుంచుకుంటాం. ఇలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్న వెబ్ సిరీస్ దయా. లొకేషన్స్, క్యారెక్టర్స్, స్క్రిప్ట్ అన్నీ బాగా కుదిరిన సిరీస్ ఇది. ► దయాలో నేను ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ ను. చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం నా పని. దయా వరల్డ్ ను ప్రారంభం నుంచీ 10, 12 నిమిషాల పాటు ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడు. ఆ ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ కు ఒకరోజు అమ్మాయి శవం కనిపిస్తుంది. పోలీసులకు చెప్పేంత ధైర్యం అతనిలో ఉండదు. ఈ భయంలో ఉండగానే ఇంకో శవం దొరుకుతుంది. సాదాసీదా జీవితం గడిపే ఆ డ్రైవర్ జీవితాన్ని ఈ ఘటనలు మలుపుతిప్పుతాయి. ఆ ఎమోషన్స్ అన్నీ దయాలో చూస్తారు. ► ఓటీటీలో స్టార్ డమ్ ను కౌంట్ చేయలేము అనడం సరికాదు. సినిమా ఎంత సక్సెస్ అయ్యింది అనేందుకు థియేటర్ లో మనకు కలెక్షన్స్ లెక్కిస్తాం. కానీ ఓటీటీలో ఎంతమంది చూశారు అనేది కొలమానం. కథను సినిమాలో కంటే విస్తృతంగా చెప్పేందుకు వెబ్ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. వెబ్ సిరీస్ లో కొత్త వాళ్లకూ ఆదరణ దక్కుతుంది. వాళ్లనూ రిసీవ్ చేసుకుంటారు. కానీ థియేటర్ లో స్టార్స్ సినిమాలకు మాత్రమే బయ్యర్స్ ఉంటారు. ఇది ఓటీటీకున్న అడ్వాంటేజ్. నేను జేడీ చక్రవర్తి కాకుండా కొత్త నటుడిగా దయాలో చూస్తారు.