
ద్వారకాతిరుమల: ‘అందరికీ నచ్చిన అమ్మాయిని మనం పెళ్లి చేసుకోలేం.. అలాగే అందరికీ నచ్చినట్టుగా సినిమా తీయలేం.. కథలో దమ్ముంటే ఎలాంటి సినిమా అయినా హిట్ అవుతుంది’ అని సినీ హీరో జేడీ చక్రవర్తి పేర్కొన్నారు. ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో జేడీ శుక్రవారం సందడి చేశారు. ముందుగా ఆయన శ్రీవారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖమండపంలో అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయంలో పలువురు భక్తులు జేడీతో ఫొటోలు దిగేందుకు ఆసక్తిచూపారు. అనంతరం జేడీ విలేకర్లతో కాసేపు ముచ్చటించారు. తాను ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించానన్నది ఎప్పుడూ లెక్కించలేదని చెప్పారు.
ప్రస్తుతం రామ్‌గోపాల్‌వర్మ నిర్మిస్తున్న ఇంకా పేరు పెట్టని ఒక థ్రిల్లర్ చిత్రానికి దర్శకుడిగా, హీరోగా చేస్తున్నట్టు వివరించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఉగ్రం చిత్రంలో హీరోగా నటిస్తున్నానని, ఈ చిత్రం థ్రిల్లర్‌తోపాటు హ్యూమరస్‌గా ఉంటుందని పేర్కొన్నారు. కన్నడంలో సూపర్ హీరోయిన్ పూజాక్రాంతి నిర్మిస్తున్న రావణి చిత్రంలో ఆమె సరసన హీరోగా నటిస్తున్నానని వివరించారు
Comments
Please login to add a commentAdd a comment