జేడీ చక్రవర్తి మళ్లీ.. ఈసారి ఏకంగా! | D Chakravarthy thriller Who gears up for release | Sakshi
Sakshi News home page

J. D. Chakravarthy: జేడీ చక్రవర్తి మళ్లీ.. ఈసారి ఏకంగా!

Published Sun, Aug 13 2023 6:26 AM | Last Updated on Sun, Aug 13 2023 7:03 AM

D Chakravarthy thriller Who gears up for release - Sakshi

జేడీ చక్రవర్తి నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ద్విభాషా (కన్నడ, తెలుగు) చిత్రం ‘హూ’. ఇందులో శుభరక్ష, నిత్య హీరోయిన్లు. రెడ్డమ్మ కే బాలాజీ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్‌ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత ప్రసన్న కుమార్, నటుడు నాగమహేశ్‌లు కలిసి విడుదల చేశారు. నిర్మాతలు ఆచంట గోపీనాథ్, శోభారాణి, చాంబర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కొల్లి రామకృష్ణ ‘హూ’ సినిమా కొత్త ΄ోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి నటన వైవిధ్యంగా ఉంటుంది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అని రెడ్డమ్మ కే బాలాజీ  అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement