nitya
-
రజతం నెగ్గిన నిత్య
చండీగఢ్: ఇండియన్ గ్రాండ్‌ప్రి ఐదో మీట్లో తెలంగాణ అథ్లెట్ జి. నిత్య మహిళల 100 మీటర్ల విభాగంలో రజత పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మీట్లో నిత్య 100 మీటర్ల దూరాన్ని 11.85 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. శ్రాబణి నందా (ఒడిశా; 11.77 సెకన్లు) స్వర్ణం, దానేశ్వరి (కర్ణాటక; 11.94 సెకన్లు) కాంస్యం సాధించారు. -
జేడీ చక్రవర్తి మళ్లీ.. ఈసారి ఏకంగా!
జేడీ చక్రవర్తి నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ద్విభాషా (కన్నడ, తెలుగు) చిత్రం ‘హూ’. ఇందులో శుభరక్ష, నిత్య హీరోయిన్లు. రెడ్డమ్మ కే బాలాజీ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత ప్రసన్న కుమార్, నటుడు నాగమహేశ్‌లు కలిసి విడుదల చేశారు. నిర్మాతలు ఆచంట గోపీనాథ్, శోభారాణి, చాంబర్ వైస్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ ‘హూ’ సినిమా కొత్త ΄ోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ఎమోషనల్ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి నటన వైవిధ్యంగా ఉంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని రెడ్డమ్మ కే బాలాజీ అన్నారు. -
వృద్ధుడిపై సీరియల్ నటి వలపు వల: పక్కా ప్లాన్‌తో ఇంటికి పిలిచి..
కేరళలోని పాతనమిట్ట ప్రాంతానికి చెందిన నిత్యా శశి (32) మలయాళ టీవీ సీరియల్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈజీ మనీ కోసం తన స్నేహితుడు బినుతో కలిసి అడ్డదారులు తొక్కింది. తిరువనంతపురంలో ఉండే ఆర్మీ రిటైర్ ఉద్యోగి అయిన 75 ఏళ్ల పెద్దాయనకు తన స్నేహితుడితో కలిసి నిత్య వలేసింది. ఇల్లు అద్దెకు కావాలనే వంకతో ఆ సీనియర్ సిటిజన్‌తో నిత్య పరిచయం పెంచుకుని ట్రాప్ చేసి డబ్బులు గుంజే ప్లాన్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. (ఇదీ చదవండి: నయనతార ఇంతే.. ఆమెను ఏం చేయలేం: విశాల్) కేరళకు చెందిన సీరియల్ నటి, న్యాయవాది అయిన నిత్య అద్దెకు ఉండేందుకు ఇంటిని వెతుకుతుండగా వృద్ధుడిని సంప్రదించింది. అక్కడ ఏర్పడిన పరిచయంతో నిరంతర ఫోన్ కాల్స్ ద్వారా వృద్ధుడితో నిత్య స్నేహం పెంచుకుంది. అలా వారిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగింది. దీంతో ఒకరోజు కలకోటేలోని తన అద్దె ఇంటికి రావాలని ఆ వృద్ధుడిని నటి నిత్య పిలిచింది. నిత్య ఆహ్వానాన్ని మన్నించి వృద్ధుడు కూడా ఆమె ఇంటికి వెళ్లాడు. నిత్య ఇంట్లో ఏం జరిగిందో పోలీసులకు ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు. 'నేను.. నిత్య ఇంటికి వెళ్లగానే నన్ను మాటల్లో ఉంచి ఆమె నా దుస్తులు తొలగించింది. ఆపై ఆమె కూడా దుస్తులు తొలగించుకుంది. ఇంతలో నిత్య స్నేహితుడు బిను వచ్చి నా ఫోటోలతో పాటు.. కొన్ని ఇద్దరం ఉన్న ఫోటోలను కూడా తీశాడు. ఆపై అడిగినంత డబ్బు ఇవ్వాలని లేదంటే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని వారిద్దరు బెదిరింపులకు దిగారు. దీంతో ఇప్పటికే వారికి రూ.11 లక్షలు ఇచ్చాను. కానీ వారు రూ. 25 లక్షలు డిమాండ్ చేశారు. అంత డబ్బు లేదని, ఇక ఇవ్వలేనని వారికి తెలిపాను. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించారు' అని పోలీసులకు తెలిపాడు. (ఇదీ చదవండి: BRO Movie Twitter Review: పవన్ కల్యాణ్ ‘బ్రో’మూవీకి ఊహించని టాక్!) దీంతో పోలీసుల సూచన మేరకు ఆ వృద్ధుడు రూ.25 లక్షలు డబ్బు ఇస్తానని వారిద్దరికి ఆఫర్ చేశాడు. కానీ డబ్బు కోసం తన ఇంటికి ఆహ్వానించాడు. పక్కా ప్లాన్‌తో పోలీసులు అక్కడే ఉండి నిత్య,బినూను అరెస్ట్ చేశారు. ఆపై వారిద్దిరని కోర్టులో హాజరుపరిచారు. నిత్య ఇప్పటికే పలు ప్రముఖ సీరియల్స్‌తో పాటు అక్కడి ప్రసిద్ధ షోలలో కూడా కనిపించింది. -
కూతుర్ని చూడగానే ఎమోషనల్ అయిన యాంకర్ రవి
Bigg Boss 5 Telugu Today Promo, Anchor Ravi Gets Emotional: బిగ్‌బాస్ హౌస్ ఎమోషన్స్‌తో నిండిపోయింది. ప్రతి సీజన్లోలాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్ బిగ్‌బాస్‌లోకి ఎంటర్ కావడంతో రియల్ ఎమోషన్స్ బయటకొచ్చాయి. ఇప్పటికే కాజల్, శ్రీరామచంద్ర, సన్నీ, సిరి, మానస్‌ల కుటుంబసభ్యులు ఎంటర్ అవగా, నేటి ఎపిసోడ్లో యాంకర్ రవి కోసం భార్య నిత్య, కూతురు వియా వచ్చారు. దీంతో రవి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రతిరోజూ వియా ఫోటో చూడనిదే నిద్ర లేవని రవి నేరుగా కూతుర్ని చూడటంతో సంతోషంలో మునిగిపోయాడు. ప్రేమగా హత్తుకొని కాసేపు కబర్లు చెప్పడంతో పాటు సరదాగా ఆడిస్తాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా రిలీజ్ చేసింది. ఎంతో ఎమోషనల్‌గా సాగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. రవి కూతురు వియా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Daughter ni chusaka #Ravi emotions are priceless ❤️ #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/RZLbVj0sIT — starmaa (@StarMaa) November 26, 2021 -
Bigg Boss 5 Telugu: ఫేక్ అకౌంట్లతో ట్రోలింగ్.. రవి భార్య ఆవేదన!
Netizens Troll Bigg Boss Contestant Anchor Ravi Family With Fake Accounts: బిగ్ బాస్ ఇంట్లో యాంకర్ రవి మంచి స్ట్రాటజీలను ప్లే చేస్తూ స్ట్రాంగ్ కంటెంస్టెంట్ మారాడు. టాప్ 5లో రవి పక్కా ఉంటాడని షో ఫాలో అవుతున్నవారందనికి అర్థమవుతుంది. ముందు నుంచే యాంకర్ రవికి బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, హౌస్‌లోకి వెళ్లాక..తనదైన ఆటతీరుతో మరింతమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రతివారం ఎలిమినేషన్లో ఉండడం కూడా రవికి కలిసొచ్చిందనే చెప్పాలి. నామినేషన్ ఒత్తిడిని దిగమింగుకొని గేమ్‌ను గేమ్‌లా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఇప్పటికే ఆయన హౌస్‌లో ఉన్నాడు. ఇక ఇలాంటి రియాల్టీ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌పై ట్రోలింగ్ అనేది సహజమే. కొంతమంది తమకు నచ్చిన కంటెస్టెంట్‌ని పొగుడుతూ.. ప్రత్యర్థులను తిడుతుంటారు. అయితే దానికి ఓ కారణం, సందర్భం ఉంటేనే ఫ్యాన్స్ ఇతరులను ట్రోలింగ్ చేస్తుంటారు. కానీ యాంకర్ రవి విషయంలో మాత్రం అందుకు విరుద్దంగా జరుగుతుంది. కొంతమంది రవిని అకారణంగా ట్రోల్ చేయడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ అకౌంట్లు సృష్టించి, రవిని, వాళ్ల కుటుంబ సభ్యుల్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారని రవి సన్నిహితులు చెబుతున్నారు. రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్నాడు కాబట్టి..అతన్ని తిట్టినా, పొగిడినా పర్లేదు.. కానీ అతని కుటుంబ సభ్యులను కూడా ట్రోల్స్ చేయడం దారుణమనే చెప్పాలి. ‘కావాలనే కొంతమంది నా పేరును, నా కూతురిను ఈ ట్రోల్స్‌లోకి తీసుకొస్తున్నారు’అని రవి భార్య నిత్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇది గేమ్ స్పిరిట్ కాదని, తమకు ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదని సన్నిహితుల దగ్గర వాపోయింది. వాస్తవానికి బిగ్‌బాస్ లాంటి రియాల్టీ షోలోకి వెళ్లే కంటెస్టెంట్స్ ముందే ఓ గట్టి పీఆర్ టీమ్‌ని ఏర్పాటు చేసుకుంటుంది. వాళ్లు హౌస్‌లో ఉంటే బయట పీఆర్ టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుంది. అయితే తమ కంటెస్టెంట్స్‌ని పొగుడుతూ ప్రచారం చేస్తే బాగుంటుంది కానీ...తమవారిని హైలెట్ చేయడం కోసం ఇతరులను ట్రోల్ చేయడం సరికాదు. దాని వల్ల తమ సభ్యుడు ఎలివేట్ అవుతామనుకోవడం పొరపాటు. -
Under 23 Athletics Championships: సత్తా చాటుతున్న మన అమ్మాయిలు
న్యూఢిల్లీ: జాతీయ అండర్–23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల విభాగంలో తెలంగాణకు చెందిన నిత్య గాంధె, నకిరేకంటి మాయావతి ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన 100 మీటర్ల హీట్స్‌లో నిత్య 11.91 సెకన్లతో రెండో స్థానంలో, మాయావతి 12.40 సెకన్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. రెండు హీట్స్‌లో అత్యుత్తమ సమయం నమోదు చేసిన ఎనిమిది మందికి ఫైనల్ బెర్త్ లభించింది. మహిళల 1500 మీటర్ల ఫైనల్లో తెలంగాణకు చెందిన భాగ్యలక్ష్మి ఆరో స్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల విభాగంలో నక్కా రాజేశ్ (ఆంధ్రప్రదేశ్), 110 మీటర్ల హర్డిల్స్‌లో యశ్వంత్ (ఆంధ్రప్రదేశ్) ఫైనల్ చేరారు. చదవండి: Vennam Jyothi Surekha: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో జ్యోతి సురేఖ.. ఏకంగా -
ఆ వీడియోలు డిలీట్ చేయండి: OMG నిత్య
-
భార్గవ్‌తో సంబంధం లేదు..ఆ వీడియోలు డిలీట్ చేయండి: OMG నిత్య
మైనర్ బాలిక అత్యాచార కేసులో టిక్‌టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్‌ని దిశ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక భార్గవ్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారనగానే. చాలామంది ‘ఓమైగాడ్ నిత్య’పేరును తెరపైకి తీసుకొచ్చారు. భార్గవ్ అత్యాచారానికి పాల్పడ్డది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు నిత్య ఫోటోలను వాడేస్తున్నారు. అయితే తాజాగా ఈ వార్తపై నిత్య స్పందించింది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసింది. ‘నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. ఫన్ బకెట్ భార్గవ్ రేప్ కేసు విషయంలో అరెస్ట్ అయిన మాట నిజమే. కానీ నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మీకు ఎలా అయితే సోషల్ మీడియా ద్వారా తెలిసిందో నాక్కూడా అలాగే తెలిసింది. నా ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేయడం వల్ల నేను ఆ న్యూస్ చూడటం జరిగింది. చాలామంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు.. ఏం జరిగింది అని.. నాకైతే ఏ విషయం తెలియదు.. అసలు నాకు ఆ మ్యాటర్‌కి సంబంధం లేదని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు.. భార్గవ్‌ని కలిసి సంవత్సరం పైనే అయ్యింది.. నాకు కాంటాక్ట్‌లో కూడా లేడు. ఇప్పుడు మేం కలిసి వీడియోలు కూడా చేయడం లేదు. మేం హైదరాబాద్‌కి వచ్చేశాం. అయితే ఈ ఇష్యూలో చాలామంది మీమ్స్ చేసేవాళ్లు.. ట్రోలర్స్.. యూట్యూబ్ వాళ్లు నా పేరు, ఫోటోలు వాడుతున్నారు. మీరంతా తెలియక చేస్తున్నారని నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చా. మీరు నా ఫొటోలు వాడటం లాంటివి కావాలని చేస్తున్నారని అనుకోవడం లేదు. దయచేసి వాటిని డిలీట్ చేయాలని కోరుతున్నా. మీకు రెండు రోజుల్లో అసలు నిజాలు తెలుస్తాయి. అప్పుడైనా డిలీట్ చేయండి. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నా. షూటింగ్లో ఉన్నా’ అంటూ తన తల్లితో కలిసి వీడియో విడుదల చేసింది చదవండి: అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్.. భార్గవ్ నిజస్వరూపం బట్టబయలు -
పొలిటికల్ సెటైర్‌గా..!
సమకాలీన రాజకీయాలపై దండయాత్ర చేసే చిత్రంగా ఒబామా ఉంగళుక్కాగ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు అంటున్నారు. ఇంతకు ముందు అదు వేర ఇదు వేర చిత్రాన్ని నిర్మించిన జీపీజీ ఫిలింస్ అధినేత ఎస్.జయశీలన్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఒబామా ఉంగళుక్కాగ. నానీబాలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు బాలకృష్ణన్ పేరుతో పాస్‌మార్క్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఒబామా ఉంగళుక్కాగ చిత్రంలో పృధ్వీ కథానాయకుడిగా నటిస్తున్నారు. నవ నటి పూర్ణిషా నాయకిగా పరిచయం అవుతోంది. సీనియర్ నటుడు జనకరాజ్ ఇంత వరకూ పోషించనటువంటి విభిన్న పాత్రలో నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రముఖ దర్శకులు విక్రమన్, కేఎస్.రవికుమార్, రమేశ్ఖన్నాలు దర్శకులుగానే నటించడం విశేషం. అదే విధంగా నిర్మాత టీ.శివ, నిత్య, రామ్రాజ్, దళపతి దినేశ్, సెంబులి జగన్, కయల్దేవరాజ్, విజయ్ టీవీ ఫేమ్ కోదండం, శరత్ తదితరలు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది రాజకీయాలపై దండయాత్ర చేసే కథా చిత్రంగా ఉంటుందన్నారు. కథను ఎంతో శోధించి, పలువురు సలహాలను తీసుకుని తెరెక్కించిన చిత్రం ఒబామా ఉంగళుక్కాగ అని తెలిపారు. థామస్ అల్వా ఎడిసన్ టెలిఫోన్‌ను కనిపెట్టింది మాట్లాడుకోవడానికేనని, అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్లో చూడలేనిదీ, సాధించలేనిదీ ఏదీ లేదన్నట్టుగా మారిపోయిందన్నారు. ఈ చిత్రంలో అలాంటి సెల్‌ఫోన్ కూడా ఒక హీరో పాత్రగా ఉంటుందని చెప్పారు. రాజకీయాలను నార తీసి పిండే చిత్రంగా ఒబామా ఉంగళుక్కాగ చిత్రం ఉంటుందని చెప్పారు. శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందించడంతో పాటు ఒక పాటలో డాన్స్ చేసి దుమ్మురేపారన్నారు. చిత్రానికి దినేశ్ శ్రీనివాస్ ఛాయాగ్రహణంను అందిస్తున్నట్లు ఆయన వివరించారు. -
కోర్టు మెట్లెక్కిన నటుడి భార్య
పెరంబూరు(తమిళనాడు): హాస్య నటుడు దాడి బాలాజీ భార్య నిత్య అతని నుంచి విడాకులు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టును ఆశ్రయించింది. దాడిబాలాజీ బుల్లితెర వ్యాఖ్యాతగా మంచి పేరు సంపాదించుకున్నాడు. బాలాజీకి, అతని భార్య నిత్యకు మధ్య కొన్ని నెలలుగా మనస్పర్థలు ఏర్పడడంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. తన భర్త నిత్యం కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ నిత్య ఇటీవల చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత బాలాజీ కూడా కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అందులో.. తన భార్యను ఒక సబ్ ఇన్స్పెక్టర్, జిమ్ నిర్వాహకుడు బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నాడు. వారు ఫేస్బుక్ ద్వారా తన భార్యకు పరిచయం అయ్యారని, అప్పటి నుంచి తమ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని పేర్కొన్నాడు. తాను భార్యతో కలిసి జీవించడానికి ఆ ఇద్దరు అడ్డు పడుతున్నారని, వారి నుంచి తన భార్యను కాపాడాల్సిందిగా కోరారు. బాలాజీ ఆరోపణలు ఖండించిన నిత్య, బాలాజీ తనకు అక్రమ సంబంధాలు అంటకడుతున్నాడని మండిపడ్డారు. ఆతని ఆరోపణలతో సబ్ ఇన్స్పెక్టర్, జిమ్ నిర్వాహకుడి కుటుంబాల్లో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వారితో తనకెలాంటి సంబంధాలు లేవని చెప్పారు. తాను ఇకపై భర్తతో కలిసి జీవించలేనని, అందుకే చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. -
నిత్యకల్యాణ రాముడు
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి బుధవారం వైభవంగా నిత్యకల్యాణం జరిపారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం గావించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ, యోత్రధారణ చేశారు. వేదపండితులు విన్నపాలిచ్చారు. గోత్రనామాలను చదివి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. – భద్రాచలం