Malayalam TV Actress Nithya Sasi And Her Friend Arrested For Allegedly Honey Trapping On Old Man - Sakshi
Sakshi News home page

Kollam Honey Trap Case: సీరియల్‌ నటి వలపు వల.. వృద్ధుడిని పక్కా ప్లాన్‌తో ఇంటికి పిలిచి ఆపై..

Published Sat, Jul 29 2023 8:23 AM | Last Updated on Mon, Jul 31 2023 2:56 PM

Malayalam Actress Nithya Sasi Honey Trap On Old Man - Sakshi

కేరళలోని పాతనమిట్ట ప్రాంతానికి చెందిన నిత్యా శశి (32) మలయాళ టీవీ సీరియల్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈజీ మనీ కోసం తన స్నేహితుడు బినుతో కలిసి అడ్డదారులు తొక్కింది. తిరువనంతపురంలో ఉండే  ఆర్మీ రిటైర్ ఉద్యోగి అయిన 75 ఏళ్ల పెద్దాయనకు తన స్నేహితుడితో కలిసి నిత్య వలేసింది. ఇల్లు అద్దెకు కావాలనే వంకతో ఆ సీనియర్ సిటిజన్‌తో నిత్య పరిచయం పెంచుకుని ట్రాప్‌ చేసి డబ్బులు గుంజే ప్లాన్‌ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.

(ఇదీ చదవండి: నయనతార ఇంతే.. ఆమెను ఏం చేయలేం: విశాల్‌)

కేరళకు చెందిన సీరియల్ నటి, న్యాయవాది అయిన నిత్య అద్దెకు ఉండేందుకు ఇంటిని వెతుకుతుండగా వృద్ధుడిని సంప్రదించింది. అక్కడ ఏర్పడిన పరిచయంతో నిరంతర ఫోన్ కాల్స్ ద్వారా వృద్ధుడితో నిత్య స్నేహం పెంచుకుంది. అలా వారిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగింది. దీంతో ఒకరోజు కలకోటేలోని తన అద్దె ఇంటికి రావాలని ఆ వృద్ధుడిని నటి నిత్య  పిలిచింది. నిత్య ఆహ్వానాన్ని మన్నించి వృద్ధుడు కూడా ఆమె ఇంటికి వెళ్లాడు.

నిత్య ఇంట్లో  ఏం జరిగిందో పోలీసులకు ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు. 'నేను.. నిత్య ఇంటికి వెళ్లగానే నన్ను మాటల్లో ఉంచి ఆమె నా దుస్తులు తొలగించింది. ఆపై ఆమె కూడా దుస్తులు తొలగించుకుంది. ఇంతలో నిత్య స్నేహితుడు బిను వచ్చి నా ఫోటోలతో పాటు.. కొన్ని ఇద్దరం ఉన్న ఫోటోలను కూడా తీశాడు. ఆపై అడిగినంత  డబ్బు ఇవ్వాలని లేదంటే ఫోటోలను సోషల్‌ మీడియాలో పెడతామని వారిద్దరు బెదిరింపులకు దిగారు. దీంతో ఇప్పటికే వారికి రూ.11 లక్షలు ఇచ్చాను. కానీ వారు రూ. 25 లక్షలు డిమాండ్‌ చేశారు. అంత డబ్బు లేదని, ఇక ఇవ్వలేనని వారికి తెలిపాను. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించారు' అని  పోలీసులకు తెలిపాడు.

(ఇదీ చదవండి: BRO Movie Twitter Review: పవన్‌ కల్యాణ్‌ ‘బ్రో’మూవీకి ఊహించని టాక్‌!) 

దీంతో పోలీసుల సూచన మేరకు ఆ వృద్ధుడు  రూ.25 లక్షలు డబ్బు ఇస్తానని వారిద్దరికి ఆఫర్‌ చేశాడు. కానీ డబ్బు కోసం తన ఇంటికి ఆహ్వానించాడు. పక్కా ప్లాన్‌తో పోలీసులు అక్కడే ఉండి నిత్య,బినూను అరెస్ట్‌ చేశారు. ఆపై వారిద్దిరని కోర్టులో హాజరుపరిచారు. నిత్య ఇప్పటికే పలు ప్రముఖ సీరియల్స్‌తో పాటు అక్కడి ప్రసిద్ధ షోలలో కూడా కనిపించింది.


  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement