Women's 100m Final | Under 23 World Athletics Championship - Sakshi
Sakshi News home page

Under 23 Athletics Championships: సత్తా చాటుతున్న మన అమ్మాయిలు

Sep 28 2021 8:18 AM | Updated on Sep 28 2021 10:46 AM

Under 23 Athletics Championships: Nithya And Mayawati In 100M Final - Sakshi

నిత్య

న్యూఢిల్లీ: జాతీయ అండర్‌–23 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల విభాగంలో తెలంగాణకు చెందిన నిత్య గాంధె, నకిరేకంటి మాయావతి ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన 100 మీటర్ల హీట్స్‌లో నిత్య 11.91 సెకన్లతో రెండో స్థానంలో, మాయావతి 12.40 సెకన్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు.

రెండు హీట్స్‌లో అత్యుత్తమ సమయం నమోదు చేసిన ఎనిమిది మందికి ఫైనల్‌ బెర్త్‌ లభించింది. మహిళల 1500 మీటర్ల ఫైనల్లో తెలంగాణకు చెందిన భాగ్యలక్ష్మి ఆరో స్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల విభాగంలో నక్కా రాజేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌), 110 మీటర్ల హర్డిల్స్‌లో యశ్వంత్‌ (ఆంధ్రప్రదేశ్‌) ఫైనల్‌ చేరారు. 

చదవండి: Vennam Jyothi Surekha: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో జ్యోతి సురేఖ.. ఏకంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement