ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే నేడు (బుధవారం) భారత్ బంద్‌కు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి పలుపునిచ్చింది. అయితే ఈ బంద్ ప్రభావం ఢిల్లీలో కనిపించలేదు.
ఢిల్లీలోని వ్యాపారులు, ఫ్యాక్టరీ యజమానుల సమన్వయ సంస్థ చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) చైర్మన్ బ్రిజేష్ గోయల్, అధ్యక్షుడు సుభాష్ ఖండేల్వాల్ మీడియాతో మాట్లాడుతూ తాము కాష్మీరే గేట్, చాందినీ చౌక్, ఖరీ బావోలి, నయా బజార్, చావ్రీ బజార్, సదర్ బజార్, కరోల్ బాగ్, కమ్లా నగర్, కన్నాట్ ప్లేస్, లజ్‌పత్ నగర్, సరోజినీ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన 100కు పైగా మార్కెట్ సంఘాలతో ఈ విషయమై చర్చించామన్నారు. ఈ దరిమిలా తాము బంద్‌కు మద్దతు ఇవ్వడంలేదని తెలిపారు. ఢిల్లీలోని మొత్తం 700 మార్కెట్లు పూర్తిగా తెరిచి ఉంటాయని, 56 పారిశ్రామిక ప్రాంతాలు కూడా పని చేస్తాయని తెలిపారు.
మాయావతి మద్దతు
భారత్ బంద్‌కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు పలికారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం వెనుక బీజేపీ కుట్ర దాగున్నదని ఆమె ఆరోపించారు. అందుకే తాము భారత్ బంద్‌కు మద్దతు ఇస్తున్నామని తెలిపారు.
1. बीएसपी का भारत बंद को समर्थन, क्योंकि भाजपा व कांग्रेस आदि पार्टियों के आरक्षण विरोधी षडयंत्र एवं इसे निष्प्रभावी बनाकर अन्ततः खत्म करने की मिलीभगत के कारण 1 अगस्त 2024 को SC/ST के उपवर्गीकरण व इनमें क्रीमीलेयर सम्बंधी मा. सुप्रीम कोर्ट के निर्णय के विरुद्ध इनमें रोष व आक्रोश।
— Mayawati (@Mayawati) August 21, 2024
Comments
Please login to add a commentAdd a comment