'శ్రీదేవి'ని డైరెక్ట్ చేస్తున్న జెడి..? | jd chakravarthy is the director for ramgopal varma sridevi | Sakshi
Sakshi News home page

'శ్రీదేవి'ని డైరెక్ట్ చేస్తున్న జెడి..?

Published Thu, Oct 15 2015 12:40 PM | Last Updated on Sun, Sep 3 2017 11:01 AM

'శ్రీదేవి'ని డైరెక్ట్ చేస్తున్న జెడి..?

'శ్రీదేవి'ని డైరెక్ట్ చేస్తున్న జెడి..?

విలన్గా పరిచయం అయి, తరువాత హీరోగా మారి, ఆపై దర్శకుడిగా మారిన సౌత్ స్టార్ జెడి చక్రవర్తి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా అదే మాటతీరును ప్రదర్శించే జెడి చక్రవర్తి, ఓ వివాదాస్పద సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట.

గతంలో 'సావిత్రి' పేరుతో ఓ ఎరోటిక్ సినిమాను ఎనౌన్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. తన టీచర్ మీద మనసుపడే అబ్బాయి కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా పోస్టర్లతోనే క్లియర్ చేశాడు వర్మ. అయితే వర్మ విడుదల చేసిన పోస్టర్స్తో పాటు, సినిమాకు పెట్టిన 'సావిత్రి' అనే టైటిల్ అప్పట్లో పెద్ద దుమారం లేపింది. దీంతో కాస్త వెనక్కి తగ్గిన వర్మ సినిమా టైటిల్ ను 'శ్రీదేవి'గా మార్చాడు.

చాలా కాలంగా శ్రీదేవి సినిమా విషయంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వని వర్మ టీం... తాజాగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు రావాలని ఆలోచిస్తుందట. వర్మ శిష్యుడైన జెడి చక్రవర్తి దర్శకత్వంలో ఈ సినిమాను పూర్తి చేసి వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సెట్స్ మీదకు రాకుండానే వివాదాలు సృష్టించిన శ్రీదేవి రిలీజ్ లోపు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement