
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నాగార్జున హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వర్మ సొంత నిర్మాణ సంస్థ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఈ రోజు తెల్లవారు జామున ప్రముఖ సినీ నటి శ్రీదేవి మరణించడంతో టైటిల్ ప్రకటన చేయలేదు.
రాంగోపాల్ వర్మ శ్రీదేవి మరణించడంతో అందరికన్నా ఎక్కువ బాధకు గురయ్యారని చెప్పొచ్చు. అతిలోక సుందరి శ్రీదేవి మరణాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈరోజు ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేస్తూ విచారం వ్యక్తం చేస్తున్నారు. తనని తాను శ్రీదేవి ఆరాధకుడిగా చెప్పుకునే వర్మ ఆమెతో గడిపిన ప్రతిక్షణాన్ని సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకున్నారు. వీటన్నింటి మధ్య నాగ్ సినిమా టైటిల్‌ను ప్రకటించలేదు. వర్మ టైటిల్‌ను ఎప్పుడు ప్రకటిస్తారో వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment